సాక్షి, ముంబై: మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న మహిళా బాధితులపై ఇక పరువునష్టం దావాల పర్వం మొదలైంది. తనపై లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలపై న్యాయపరమైన చర్యలకు నటుడు అలోక్‌నాథ్ రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యాచార ఆరోపణలు చేసినరచయిత ప్రొడ్యూసర్ వింటా నందాపై డిఫమేషన్ కేసు వేశారు. ఈ ఆరోపణలను ఖండించవచ్చు. అలాగే అంగీకరించవచ్చు. రేప్ కూడా జరిగి ఉండవచ్చు కానీ వేరేవాళ్లేవరో చేసి ఉండొచ్చు అంటూ చిత్ర విచిత్ర సమాధానాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన అలోక్ నాథ్ ఇపుడికి చట్టపరంగా సవాల్‌కు దిగారు.
కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చారు. 19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకున్న సంగతి తెలిసిందే. నటి తనూశీ దత్తా- నటుడు నానా పటేకర్ వివాదంతో మొదలైన మీట సెగ మీడియా, ఇతర రంగాల్లోని ‘పెద్దమనుషులను’ తాకింది.
జర్నలిస్టు సంధ్యామీనన్, సింగర్ చిన్నయి శ్రీపాద తదితరులు రగిలించిన ఈ ఉద్యమం క్రమంగా రాజకీయాలతో పాటు అన్ని రంగాలకు విస్తరిస్తోంది. కేంద్రమంతి ఎంజె అక్బర్, బాలీవుడ్ దర్శకులు వికాస్ భల్, సాజిద్‌ఖాన్, సుభాయ్ ఘాయ్, కరీం మొరానీ రచయిత చేతన్ భగత్ , సీనీ గేయ రచయిత వైరముత్తు, సింగర్లు కైలాశ్ ఖేర్, కార్తీక్, రఘుదీక్షిత్.. క్రికెటర్లు.. ఇలా చెప్పుకుంటే పోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచకుల జాబితా చాంతాండంత.
Comments
Please login to add a commentAdd a comment