defamation cases
-
TN: కేసుల నుంచి ఆ ముగ్గురికీ ఉపశమనం
సాక్షి, చెన్నై: గత ప్రభుత్వం వేసిన పరువు నష్టం దావా కేసుల్లో డీఎంకే ఎంపీలు కనిమొళి, దయానిధి మారన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు విముక్తి లభించింది. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు చేసినట్టు గత ప్రభుత్వ హయాంలో వీరిపై దావా దాఖలైంది. ఈ పిటిషన్ విచారణలో ఉండగా, రాష్ట్రంలో అధికారం మారింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు ఆ కేసుల్ని కొనసాగించలేమని, రద్దు చేయాలని కోర్టుకు సూచించింది. దీంతో ఆ ముగ్గురి మీద వేర్వేరుగా దాఖలైన పిటిషన్లు తిరస్కరిస్తూ, కేసు నుంచి విముక్తి కల్పిస్తూ సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిక్కుల్లో ఎస్పీ వేలుమణి.. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్‌పై పది వారాల్లో చార్జ్‌షీట్ దాఖలుకు ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఎస్పీ వేలుమణిపై టెండ్లర్లలో అక్రమాలు అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ దాడులు సైతం జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎస్పీ వేలుమణికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీ ఆర్ ఎస్‌భారతి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. చార్జ్‌షీట్ దాఖలు చేయాలని, విచారణను త్వరితగతిన ముగించాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. -
Samantha Defamation Case: కూకట్పల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..!
సాక్షి, చెన్నై : గతంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పుగలేంది తీరు ఆపార్టీ అగ్రనాయలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామికి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పుగలేంది వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. అయితే ప్రాథమిక సభ్యత్వం నుంచి తనను అకారణంగా తొలగించారంటూ పుగలేంది కోర్టుకెక్కారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తన పరువుకు భంగం కల్గించిన పన్నీరు సెల్వం, ‡పళనిస్వామిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించాలని కోర్టుకు పుగలేంది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పన్నీరు సెల్వం, పళని స్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం విచారణకు ఆ ఇద్దరు హాజరు కావాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపుతూ, నేరుగా కోర్టుకు హాజరయ్యే అంశం నుంచి మినహాయింపు ఇవ్వాలని తమ న్యాయవాదుల ద్వారా వారు పిటిషన్ వేశారు. ఈ విజ్ఞప్తి కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 14వ తేదీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు. కొడనాడు కేసులో.. వాదోపవాదాలు కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీ వ్యవహారం తాజాగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షిగా ఉన్న కోయంబత్తూరుకు చెందిన రవి దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ ముగించి, చార్జ్‌షీట్ సైతం దాఖలై ఉందని, ఈ సమయంలో మళ్లీ పునఃవిచారణ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. స్టే విధించాలని కోరారు. అయితే, రవి ఓ సాక్షి మాత్రమేనని, అతడి వాదనను పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేశారు. అలాగే, ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామి, శశికళ, ఆమె బంధువు ఇలవరసిని విచారించేందు అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈనేపథ్యంలో న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరించనున్నట్లు ప్రకటించారు. -
మిస్త్రీ వివాదం: వాడియా సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంలో టాటాపై నమోదుచేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసును ఉపసంహరించుకోవాలని బాంబై డైయింగ్ చైర్మన్ నస్లీ వాడియా నిర్ణయించారు. రతన్ టాటా సహా ఇతరులపై రూ. 3వేల కోట్ల విలువైన పరువు నష్టం దావాలున్నింటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో వాడియా - టాటా యుద్ధానికి తెరపడింది. పరిణతి చెందిన వ్యక్తులుగా ఇద్దరూ కేసులను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే టాటా, వాడియాలను ఇటీవల కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. రతన్ టాటాపై పరువు నష్టం దావాను వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. వాడియాపై పరువు తీసే ఉద్దేశం లేదని టాటా సుప్రీంకోర్టుకు చెప్పడంతో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్సీ వ్యాపారవేత్త ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా సన్స్ నుంచి ఆయన మిత్రుడు మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం వాడియా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌లో అత్యంత సీనియర్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్న నస్లీ వాడియాను తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో రూ .3,000 కోట్లు పరిహారం కోరుతో 2016 డిసెంబర్లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇందులో వాడియా బోర్డు సభ్యులు అజయ్ పిరమల్, రణేంద్ర సేన్, విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ఫ్ స్పేత్ , ఎఫ్ఎన్ సుబేదార్లతో పాటు మిస్త్రీ తరువాత వచ్చిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కూడా చేర్చారు. 2019 జూలైలో బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టివేయడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తన తొలగింపుపై సూరస్ మిస్త్రీ దాఖలు చేసుకున్న కేసులో మిస్త్రీని తిరిగి నియమించాలని కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఉత్తర్వులిచ్చింది. అయితే జనవరి 10న ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపి వేసిన సంగతి తెలిసిందే. -
#మీటూ : వింటా నందాపై పరువు నష్టం దావా
సాక్షి, ముంబై: మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న మహిళా బాధితులపై ఇక పరువునష్టం దావాల పర్వం మొదలైంది. తనపై లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలపై న్యాయపరమైన చర్యలకు నటుడు అలోక్‌నాథ్ రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యాచార ఆరోపణలు చేసినరచయిత ప్రొడ్యూసర్ వింటా నందాపై డిఫమేషన్ కేసు వేశారు. ఈ ఆరోపణలను ఖండించవచ్చు. అలాగే అంగీకరించవచ్చు. రేప్ కూడా జరిగి ఉండవచ్చు కానీ వేరేవాళ్లేవరో చేసి ఉండొచ్చు అంటూ చిత్ర విచిత్ర సమాధానాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన అలోక్ నాథ్ ఇపుడికి చట్టపరంగా సవాల్‌కు దిగారు. కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చారు. 19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకున్న సంగతి తెలిసిందే. నటి తనూశీ దత్తా- నటుడు నానా పటేకర్ వివాదంతో మొదలైన మీట సెగ మీడియా, ఇతర రంగాల్లోని ‘పెద్దమనుషులను’ తాకింది. జర్నలిస్టు సంధ్యామీనన్, సింగర్ చిన్నయి శ్రీపాద తదితరులు రగిలించిన ఈ ఉద్యమం క్రమంగా రాజకీయాలతో పాటు అన్ని రంగాలకు విస్తరిస్తోంది. కేంద్రమంతి ఎంజె అక్బర్, బాలీవుడ్ దర్శకులు వికాస్ భల్, సాజిద్‌ఖాన్, సుభాయ్ ఘాయ్, కరీం మొరానీ రచయిత చేతన్ భగత్ , సీనీ గేయ రచయిత వైరముత్తు, సింగర్లు కైలాశ్ ఖేర్, కార్తీక్, రఘుదీక్షిత్.. క్రికెటర్లు.. ఇలా చెప్పుకుంటే పోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచకుల జాబితా చాంతాండంత. -
కేజ్రీవాల్ దారిలోనే ఆప్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నడిచిన అడుగుజాడల్లోనే ఆప్ నేతలు పయనిస్తున్నారు. ఇటీవల కేజ్రీవాల్‌పై ఉన్న పరువు నష్టదావా నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ సారీల పర్వం ముగియగానే ఆప్ నేతలు కూడా అదేపందాను అనుసరిస్తున్నారు. తాజాగా మరో ఆప్‌నేత కుమార్ విశ్వాస్ తాను చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు, తన మీద ఢిల్లీ హైకోర్టులో వేసినే పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవాలని అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కుమార్ లేఖకు స్పందించిన జైట్లీ పరువు నష్టం దావాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కూడా కేజ్రీవాల్‌తో సహా ఆప్ నేతలు సంజయ్ సింగ్, అశుతోష్, దీపక్, రాఘవ్ చంద్రాలపై తన మీద అసత్య ఆరోపణలు చేసినందుకు పదికోట్లు చెల్లించాల్సిందిగా 2015లో ఢిల్లీ హైకోర్టులో జైట్లీ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌తో సహా ఇతర నేతలు క్షమాపణలు కోరడంతో పిటిషన్‌ను జైట్లీ వెనక్కి తీసుకున్నారు. -
కేజ్రివాల్ ‘సారీ’ల పర్వం ఇక సరి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా పైకి ఎదుగుతారని ప్రజలంతా భావిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్వీయ పాలనా వ్యవహారాలను కూడా పక్కన పెట్టి క్షమాపణ లేఖలు రాసుకోవడంలో బిజీ బిజీ అయ్యారు. శిరోమణి అకాలీ దళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజీథియాతోని మొదలైన ఆయన ‘సారీ’ లేఖల పర్వం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కపిల్ సిబాల్‌కు కూడా కొనసాగింది. నేడో, రేపో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా ఆయన క్షమాపణ లేఖలు అందనున్నాయి. అంతటితోని ఆయన ‘సారీ’ల పర్వం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయనపై 30కిపైగా పరువు నష్టం కేసులు ఉన్నాయి. దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుంచే కేజ్రివాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పురుడు పోసుకున్న విషయం తెల్సిందే. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నుంచి ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఆయన మాటలకు విలువనిచ్చే ప్రజలు ఆయనకు పట్టంగట్టారు. లేదంటే భారతీయ సంస్కృతిలో గోమాత పవిత్రమైందంటూ పక్కన పెట్టినట్లుగా పూజ్యం భావంతోనే కేజ్రివాల్‌ను పక్కన పడేసేవారు. అవినీతికి వ్యతిరేకంగా ఆయన తన పోరాటతత్వాన్ని నిజంగా చాటుకోక పోయినట్లయితే ‘వ్యవస్థలో అవినీతి అంతటా ఉంది’ అంటూ పదే పదే ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ‘సబ్ మిలే హువా హై జీ’ అన్న డైలాగ్‌తో కొట్టివేసేవారు. కేజ్రివాల్ ప్రవర్తనను ఆయన పార్టీ నాయకులు వాస్తవికవాదంగా చెప్పుకుంటున్నాయి. కోర్టు కేసులు కొట్లడాలంటే పార్టీ ఆర్థిక వనరులన్నీ కరిగిపోతాయని కొందరు నాయకులు వాదిస్తుండగా, ‘మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోలేం. ప్రజలకు అవసరమైన పాఠశాలలు, వైద్య శాలలు నిర్మించడంలో బిజీగా ఉండాలి’ అని డిప్యూటీ ముఖ్యమంత్రి మానిష్ సిసోడియా వ్యాఖ్యానించారు. ఏదైమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది కేజ్రివాల్ వ్యవహారం. అస్తమానం కేంద్రంపై కయ్యానికి వెళ్లకుండా ఆయన తన పాలనా వ్యవహారాలపై దృష్టిని కేంద్రీకరించి ఉంటే అటు పార్టీ, ఇటు ప్రభుత్వం పరిస్థితి కూడా బాగుండేది. పర్యవసానంగా ఢిల్లీ పంచాయతీ ఎన్నికల్లో కూడా పట్టు సాధించలేక పోయారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ అభివృద్ధిపై కూడా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. ముందుగా ఢిల్లీలోని 20 సీట్లకు ఉప ఎన్నికలు జరుగవచ్చు. 2019లో ఢిల్లీ లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో ఏడు సీట్లకుగాను కనీసం నాలుగు సీట్లనైనా ఆప్ గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అరవింద్ కేజ్రివాల్ ఎప్పుడు కేంద్రంతో తగువు పడుతున్నప్పటికీ రాష్ట్రాభివృద్ధిలో ఫర్వాలేదనిపించారు. పాఠశాలలను నిర్మించడంలో విద్యుత్ చార్జీలను తగ్గించడంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యాలయాలను ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఇప్పటికైనా ఆయన పూర్తిగా తన దృష్టిని రాష్ట్ర పాలనా వ్యవహారాలపైనే కేంద్రీకరించాలి. -
జయలలితకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాజకీయ ప్రత్యర్థులపై వరుసపెట్టి పరువునష్టం దావాలు వేయడాన్ని విమర్శించింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని తలంటు పోసింది. పరువునష్టం దావాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న రాష్ట్రం తమిళనాడు ఒక్కటేనని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడినంత మాత్రాన పరువునష్టం దావాలు వేయడం కుదరదని, ప్రజా జీవితంలో ఉండే వ్యక్తిగా విమర్శలను ఎదుర్కోవాలని కోర్టు సూచించింది. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినందుకు గడిచిన ఐదేళ్లలో రాజకీయ ప్రత్యర్థులు, మీడియా సంస్థలపై మొత్తం 213 పరువు నష్టం దావాలను తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసింది. ముఖ్యమంత్రి సెలవుల గురించి, నీటి సమస్య గురించి, ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం గురించి ఎవరేమన్నా అవన్నీ పరువునష్టం కిందే పరిగణించారు. గత రెండు నెలల్లో తమిళనాడు ప్రభుత్వాన్ని పరువునష్టం కేసుల్లో సుప్రీంకోర్టు విమర్శించడం ఇది రెండోసారి. ఇలా కేసులు వేయడం వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అవుతుందని సుప్రీం అప్పట్లో తెలిపింది. ఇలాంటి కేసులతో భయపెట్టి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని జయలలిత అనుకుంటారని ఆరపణలున్నాయి. పరువునష్టం విషయంలో సివిల్, క్రిమినల్ రెండు రకాల విచారణలు జరిగే అతికొద్ది దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ కేసుల్లో రెండేళ్ల జైలుశిక్ష, లేదా జరిమానా లేదా రెండుశిక్షలూ వేయొచ్చు. తమిళనాడుకు జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇది ఆరోసారి.