ఆష్లీ జేడ్ మొదలుపెట్టిన ‘మీటూ’ ఉద్యమ సెగ అన్ని ఇండస్ట్రీలను తాకింది. ‘అవకాశాలు కావాలంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే’ అని ఎవరైనా అంటే.. ఆ విషయాన్ని నిర్భయంగా బయటికి చెప్పేస్తున్నారు కొంతమంది కథానాయికలు. ప్రతీ ఇండస్ట్రీ నుంచి ఎవరో ఓ సెలబ్రిటీ ఈ ‘క్యాస్టింగ్ కౌచ్’ ఇష్యూ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి రకుల్ చేరారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య అందరూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమో.. ఇది చాలా చోట్ల ఉండి ఉండొచ్చు. కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఉండొచ్చు. అక్కడ ఉంటుందని బహుశా మనకు తెలిసి ఉండదు.
అంతే.. సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరి దృష్టి దీని మీదే ఉంటుంది కాబట్టి అందరి ఫోకస్ మావైపే ఉంటుంది. నేను ఇప్పటికి చాలా సినిమాలు చేశాను. కానీ నాకు ఒక్కరు కూడా అలాంటివాళ్లు తారసపడలేదు. ఒక్కసారి కూడా అలాంటి అనుభవం ఎదురు కాలేదు. నేను నమ్మే ఫిలాసఫీ ఒక్కటే ‘నువ్వేదో ఈజీగా ఉన్నావు లేదా అలాంటి ట్రాప్‌లో పడతావు’ అని చెప్పి నీకు పని ఇవ్వరు. ఏ ఇండస్ట్రీలో అయినా సరే టాలెంటే నీకు సక్సెస్ ఇస్తుంది. నిన్ను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతుంది. నేను నమ్మే ఫిలాసఫీ ఇదే కాబట్టి అవకాశాల కోసం నేనెవర్నీ అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment