స్మృతి ఇరానీ
ఇండోర్: మహిళల రక్షణ కోసం దేశంలో పోలీస్ వ్యవస్థ ఉందని, కఠిన చట్టాలు కూడా ఉన్నాయని కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రాజమాత విజయ రాజే సింధియా శతదినోత్సవం సందర్భంగానే బీజేపీ మీటూ ఉద్యమాన్ని బలపరుస్తాందా? అన్న విలేకురుల ప్రశ్నలకు ఆమె పైవిధంగా స్పందించారు. ‘మహిళల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ, కఠినమైన చట్టాలు మనదేశంలో ఉన్నాయి. ఏ మహిళకైన న్యాయపరంగా రక్షణ కావాలంటే వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా న్యాయస్థానాలను కూడ ఆశ్రయించవచ్చు.’ అని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మైనర్ బాలికలను అత్యాచారం చేసిన నేరస్థులకు మరణశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. అత్యాచార బాధితులకు సాధారణ జీవితం గడపడానికి తగిన సాయం అందుతుందన్నారు. లైంగిక నేరాలను పరిశీలిస్తే.. అవన్నీ తొలుత ఈవ్‌టీజింగ్‌తోనే ప్రారంభమవుతాయని, ఆ తర్వాత పెద్ద నేరాలకు దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులు, లేక సోషల్ వర్కర్స్ కానీ ఈవ్‌టీజింగ్ గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మీటూ ఉద్యమ నేపథ్యంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై సైతం స్మృతి ఇరానీ స్పందించిన విషయం తెలిసిందే. ఆయనపై వస్తున్న ఆరోపణలపై అక్భర్ సమాధానం చెప్పాలన్నారు. అంతేకాక, లైంగిక వేధింపులపై ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మహిళా జర్నలిస్ట్‌లను ఆమె అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment