వాషింగ్టన్ : లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మీ టూ క్యాంపెయిన్‌ను ప్రారంభించి.. విజయవంతంగా నడిపిన మహిళలు టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017గా ఎంపికైన విషయం తెలిసిందే. వారందరి ఫోటోలతో టైమ్ మ్యాగ్జైన్ కవర్‌పేజీపై ఓ ఫోటోను కూడా ప్రచురించింది. అయితే అందులో ఓ మహిళ ముఖానికి మాత్రం చూపించకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కవర్ ఫోటో పై ఉద్యమకారిణి అడమ ఇవూ, నటి అష్లే జుడ్డ్, సింగర్ టైలర్ స్విఫ్ట్, మెక్సికన్ స్ట్రాబెర్రీ పిక్కర్ ఇసాబెల్ పాస్కల్, ఉబెర్ మాజీ ఇంజనీర్ సునాన్ ఫ్లవర్ ఉన్నారు. ఆరో మహిళ ముఖానికి మాత్రం చూపించకుండా కేవలం చేతిని మాత్రమే చూపించటంతో అది కాస్త చర్చనీయాంశంమైంది. దీనిపై టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంథాల్ స్పందించారు.
ఆమె టెక్సాస్ కు చెందిన వ్యక్తని.. ఓ ఆస్పత్రిలో ఆమె పని చేస్తున్నారని తెలిపారు. లైంగిక వేధింపుల బాధితురాలైన ఆమె.. ఐడెంటీటి బయటపడితే తనతోపాటు తన కుటుంబ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని టైమ్ వారిని కోరిందంట. అందుకే ఆమె ఫోటోను ప్రచురించలేదని ఎడ్వర్డ్ చెప్పారు. మీటూ క్యాంపెయిన్‌లో పలువురి బండారాలను భయటపెట్టిన మహిళలు కూడా తమ ఫోటోలను ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment