Time person of the year
-
ఈసారి నలుగురు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘టైమ్’ మాగజైన్ 2018 సంవత్సరానికి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ హోదాను ప్రకటించింది. అయితే ఈసారి ఒక్కరికి కాదు, నలుగురు వ్యక్తులకు ఓ వార్తా పత్రికకు కలిపి ప్రకటించింది. వీరందరిని కలిపి ‘ది గార్డియన్స్’గా వ్యవహరించింది. టైమ్ పత్రిక ప్రతి ఏడాది వార్తాలను అత్యధిక ప్రభావితం చేసిన వ్యక్తులకు సాధారణంగా ఈ హోదాను కల్పిస్తోంది. వార్తలను అత్యధికంగా ప్రభావితం చేసిన వారిలో మంచివారే ఉండాల్సిన అవసరం లేదు. విలన్లుగా పరిగణించే వారు కూడా ఉంటారు. అందుకనే 1938లో ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను పేర్కొంది. ఈసారి గత అక్టోబర్ 2వ తేదీన సౌదీ యువరాజు కుట్రకు బలైన సౌదీ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్ జమాల్ అహ్మద్ ఖషోగ్గి, ఫిలిప్పినో జర్నలిస్ట్ మారియా రెస్సా, ఇద్దరు రాయిటర్స్ యువ జర్నలిస్టులు వా లోన్, క్యా సో ఊలతోపాటు అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది క్యాపిటల్ గెజిట్’ను కలిపి ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించింది. ఈ ఏడాది వార్తాలపై వారు చూపించిన ప్రభావాన్నే కాకుండా జర్నలిజం వత్తిపట్ల వారు ప్రదర్శించిన నిబద్ధతతోపాటు వాస్తవాలను వెల్లడించాలనే వారి సంకల్పాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈసారి ఈ హోదాను ప్రకటించినట్లు టైమ్ సంపాదకవర్గం ప్రకటించింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, ఆయన తండ్రి వ్యవహారాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు వారి పాలనాతీరును విమర్శించినందుకు యువరాజు కాన్సులేట్‌లోనే జమాల్ అహ్మద్ ఖషోగ్గిని దారుణంగా హత్య చేశారు. అనవాళ్లు దొరక్కుండా ఆసిడ్‌తో మృతదేహాన్ని కరిగించారు. మాజీ సీఎన్ఎన్ కరస్పాండెంట్ మెరియా రెస్సా ఏడేళ్ల క్రితం రాప్లర్ న్యూస్ వెబ్‌సైట్‌ను స్థాపించి నిక్ష్పక్షపాతంగానే కాకుండా ధైర్యంగా నిజాలను రాశారు. ఫిలిప్పినో అధ్యక్షుడు డ్యూడర్టే నియంత్రత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శించారు. డ్రగ్ మాఫియా కనిపిస్తే కాల్చివేయడంటూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఆయన 12 వేల మందిని చంపించారు. వాటిని ఎప్పటికప్పుడు వెల్లడించడంతో ఆన్లైన్లో ఆమెను డ్యూడర్ట్తోపాటు ఆయన సైన్యం కూడా ఎన్నో వేధింపులకు గురిచేసింది. అమెను పన్నులు ఎగ్గొట్టారన్న సాకుతో ఆమెకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు అధికార రహస్యాల చట్టం కింద వా లోన్, క్యా సో ఊన్లకు వారి ప్రభుత్వం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ‘ది క్యాపిటల్ గెజట్’ కార్యాలయంలోని గత జూన్ నెలలో ఓ ఉన్మాది జొరబడి ఐదుగురు జర్నలిస్టులను కాల్చి చంపారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల స్ఫూర్తికి గుర్తింపుగా ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ టైమ్ సంపాదకవర్గం ప్రకటించింది. -
టైమ్ కవర్ పై ఆ మిస్టరీ మహిళ ఎవరు?
వాషింగ్టన్ : లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మీ టూ క్యాంపెయిన్‌ను ప్రారంభించి.. విజయవంతంగా నడిపిన మహిళలు టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017గా ఎంపికైన విషయం తెలిసిందే. వారందరి ఫోటోలతో టైమ్ మ్యాగ్జైన్ కవర్‌పేజీపై ఓ ఫోటోను కూడా ప్రచురించింది. అయితే అందులో ఓ మహిళ ముఖానికి మాత్రం చూపించకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవర్ ఫోటో పై ఉద్యమకారిణి అడమ ఇవూ, నటి అష్లే జుడ్డ్, సింగర్ టైలర్ స్విఫ్ట్, మెక్సికన్ స్ట్రాబెర్రీ పిక్కర్ ఇసాబెల్ పాస్కల్, ఉబెర్ మాజీ ఇంజనీర్ సునాన్ ఫ్లవర్ ఉన్నారు. ఆరో మహిళ ముఖానికి మాత్రం చూపించకుండా కేవలం చేతిని మాత్రమే చూపించటంతో అది కాస్త చర్చనీయాంశంమైంది. దీనిపై టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంథాల్ స్పందించారు. ఆమె టెక్సాస్ కు చెందిన వ్యక్తని.. ఓ ఆస్పత్రిలో ఆమె పని చేస్తున్నారని తెలిపారు. లైంగిక వేధింపుల బాధితురాలైన ఆమె.. ఐడెంటీటి బయటపడితే తనతోపాటు తన కుటుంబ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని టైమ్ వారిని కోరిందంట. అందుకే ఆమె ఫోటోను ప్రచురించలేదని ఎడ్వర్డ్ చెప్పారు. మీటూ క్యాంపెయిన్‌లో పలువురి బండారాలను భయటపెట్టిన మహిళలు కూడా తమ ఫోటోలను ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని ఆయన అన్నారు. -
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా మోదీ!
రీడర్స్ పోల్‌లో మోదీ గెలుపు న్యూయార్క్: టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ కోసం జరిగిన రీడర్స్ పోల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారు. ఆదివారం రాత్రి ముగిసిన ఈ పోల్‌లో మోదీ 18 శాతం ఓట్లు సాధించారు. 2016కు సంబంధించిన ఈ పోల్‌లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంటి వారు పోటీలో ఉన్నారు. ఈ ఓటింగ్‌లో ఒబామా, ట్రంప్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేలకు 7 శాతం చొప్పున ‘యెస్’ ఓట్లు వచ్చారుు. ఇక హిల్లరీ క్లింటన్‌కు 4 శాతం, ఫేస్బుక్ ఫౌండర్ జుకర్‌బర్గ్‌కు 2 శాతం ఓట్లు లభించారుు. పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరనేది టైమ్ ఎడిటర్ త్వరలో నిర్ణయిస్తారు. అయితే ఆన్లైన్ పోల్ ఫలితాలు ప్రపంచం దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ ఏడాది దిశానిర్దేశకులపై అదో ముఖ్యమైన గవాక్షం లాంటిదని టైమ్ పేర్కొంది. కాగా, ఆన్లైన్ పోల్‌లో విజయం సాధించడం మోదీకి ఇది రెండోసారి. చెడు లేదా మంచి విషయాల్లో వార్తలను, ప్రపంచాన్ని ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తిని ప్రతిఏటా టైమ్ పత్రిక ఎంపిక చేస్తుంది. మోదీకి భారత్ నుంచేగాక అమెరికా రాష్ట్రాలైన కాలిఫోర్నియా, న్యూజెర్సీ నుంచి కూడా ఓట్లు వచ్చాయని ఓటింగ్ నిర్వహించిన అపెస్టర్ పేర్కొంది. పోల్‌లో మోదీ తొలిస్థానాన్ని కై వసంచేసుకోవడాన్ని కొందరు కేంద్రమంత్రులు స్వాగతించగా, ఇదే సర్వేను పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్‌లో చేసి ఉంటే మోదీ పాపులారిటీ తగ్గిపోయేదని విపక్షాలు వ్యాఖ్యానించారుు. నోట్లు రద్దు చేసి ఏడాదిలో ఎవరూ చేయనట్లుగా ఒకే దెబ్బతో దేశప్రజలందరినీ కష్టాల్లోకి నెట్టిన మోదీని ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ కాదని ఎవరంటారు? అని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి వ్యంగ్యంగా అన్నారు. -
టైమ్ సర్వే: ట్రంప్, ఒబామాలను దాటేసిన మోదీ!
ప్రపంచంలో వివిధ నాయకులు, కళాకారులు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులందరిలో అగ్రగామి ఎవరంటే... భారత ప్రధాని నరేంద్రమోదీయేనని తేలింది. ఈ విషయమై టైమ్ పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరంటే.. మోదీయేనని ఎక్కువమంది ఓటేశారు. అయితే, టైమ్ పత్రిక ఎడిటర్లు మాత్రం ఇంకా తమ పత్రిక తరఫున పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎవరనే విషయాన్ని నిర్ణయించాల్సి ఉంది. ఆ నిర్ణయం ఈనెల 7వ తేదీన వెలువడనుంది. ప్రస్తుతానికి ప్రజల సర్వే ఫలితాలు మాత్రం వెల్లడయ్యాయి. ఆదివారం అర్ధరాత్రితో ఈ సర్వే గడువు ముగిసేసరికి నరేంద్రమోదీకి అత్యధికంగా 18 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థులు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జూలియన్ అసాంజే.. వీళ్లందరికీ కూడా కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌కు 4 శాతం, మార్క్ జుకర్‌బర్గ్‌కు 2 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయులతో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల వారు కూడా మోదీకి అనుకూలంగా బాగా ఓటుచేసినట్లు తెలుస్తోందని ప్రస్తుత సర్వే వివరాలను విశ్లేషించిన యాప్‌స్టర్ సంస్థ తెలిపింది. టైమ్ పత్రిక ప్రతియేటా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరన్న విషయమై సర్వే చేసి ఫలితాలు ప్రకటిస్తుంది. ఈ యేడాది ఓపెన్‌టాపిక్, ఐబీఎం సంస్థలతో కలిసి టైమ్ ఎడిటర్లు తుది విజేతను నిర్ణయిస్తారు. -
‘టైమ్’ పోల్‌లో మోదీ మళ్లీ ‘టాప్’
వాషింగ్టన్: ‘టైమ్’ పత్రిక అభిప్రాయ సేకరణలో ‘ఏడాది విశిష్ట వ్యక్తి’ (పర్సన్ ఆఫ్ ది ఇయర్)గా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అగ్రస్థానం తిరిగి దక్కించుకున్నారు. ‘టైమ్’ అభిప్రాయ సేకరణలో అమెరికాలోని ఫెర్గూసన్ నిరసన కారులకు స్వల్పకాలం మోదీపై ఆధిక్యత లభించినా, తాజా ఫలితాల ప్రకారం మోదీ తిరిగి అగ్రస్థానంలో నిలిచారు. టైమ్ ఏటా నిర్వహించే ఈ పోల్ ఈనెల 8న పూర్తవుతుంది. అదేరోజు విజేతను ప్రకటిస్తారు. -
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ తుది రేసులో మోడీ
-
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ తుది రేసులో మోడీ
న్యూయార్క్: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్... ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్-2013’ అవార్డుకు కుదించిన తుది జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి చోటు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో మొత్తం 42 మందికి చోటు దక్కగా భారత్ నుంచి ఇందులో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయుడు మోడీనే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టగల అవకాశం ఉన్న వ్యక్తి ఆయనేనని ‘టైమ్’ పేర్కొంది. జాబితాలోని ఇతర ప్రముఖుల్లో జపాన్ ప్రధాని షింజో అబె, అమెరికా అధ్యక్షుడు ఒబామా, పాక్ సాహస బాలిక మలాలా, అమెరికా నిఘా రహస్యాలను బయటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నారు. విజేతను ‘టైమ్’ ఎడిటర్లు వచ్చే నెల ఎంపిక చేస్తారు. అయితే ఈ ఏడాది వార్తల్లో (మంచి అయినా/చెడు అయినా) ఎక్కువగా నిలిచిన వ్యక్తికి ఓటు వేయాల్సిందిగా ఆన్లైన్ పాఠకులను ‘టైమ్’ కోరగా 2,650కిపైగా ఓట్లు/25 శాతంతో మోడీ తొలి స్థానంలో ఉన్నారు.