mystery woman
-
పిడుగుపాటుతో వ్యాధులు నయమవుతాయా? మిస్టరీలా ఉందే!
నమ్మశక్యం కాని సంఘటనలు, ఊహకు అందని సందర్భాలు ఈ ప్రపంచంలో చాలానే ఉంటాయి. అవన్నీ కొందరికి అద్భుతాలుగా తోస్తే.. మరికొందరికి అబద్ధాలుగా అనిపిస్తుంటాయి. తర్కాన్ని నమ్మేవారికి, నమ్మనివారికి మధ్య వాగ్వాదాల చిచ్చు రాజేస్తాయి. వేలవేల మీమాంసలతో, సవాలక్ష అనుమానాలతో నిశబ్దంగా కాలాన్ని వెళ్లదీసి, అంతుచిక్కని కథలుగా మిగిలిపోతుంటాయి. అమెరికాకు చెందిన మేరీ క్లామ్సర్ జీవితం కూడా అలాంటిదే! మేరీ.. ఓక్లహోమా నివాసి. తన పందొమ్మిదేళ్ల వయసులో మల్టిపుల్ స్లె్కరోసిస్కి గురైంది. ఆ వ్యాధి ముదిరే కొద్దీ కాళ్లు చచ్చుబడి, నడవలేని స్థితి ఏర్పడుతుందని, పిల్లలు పుట్టడం కూడా కష్టమేనని వైద్యులు తేల్చేశారు. అది తెలియగానే.. మేరీ ప్రపంచం బద్దలైనట్లుగా కుమిలికుమిలి ఏడ్చింది. అప్పటికే కొన్ని నెలల క్రితం.. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాన్ క్లామ్సర్తో నిశ్చితార్థం జరగడం ఆమెను మరింత బాధించింది. తన కారణంగా రాన్ జీవితం నాశనం కావడం ఇష్టం లేని మేరీ.. ‘నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందాం.. నీ జీవితం నువ్వు చూసుకోమ’ని రాన్‌కి చెప్పేసింది. అయితే అతడు అందుకు ఒప్పుకోలేదు. ‘నువ్వు ఎలా ఉన్నా నాకు కావాలి. ఏదేమైనా కలసే బతుకుదాం’ అని పట్టుబట్టాడు. దాంతో మేరీ.. ప్రేమ మీదున్న గౌరవంతో రాన్ చేయి అందుకుంది. ఇద్దరూ పెళ్లితో ఏకమయ్యారు. అప్పటి నుంచి వీలైనంత ఓపిక తెచ్చుకుని.. భర్తతో జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తూండేది. పెళ్లైన పదేళ్ల వ్యవధిలో మూడు కష్టతరమైన కాన్పులొచ్చాయి. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు పూర్తి ఆరోగ్యంతో పుట్టారు. ఏళ్లు గడిచే కొద్దీ ఆమె వ్యాధి బాగా ముదురుతోంది. ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. నడక కష్టమైంది. మేరీకి 42 ఏళ్ల వయసు వచ్చేసరికి కుడి కాలు కూడా బలహీనమైపోయింది. పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. వీల్‌చైర్‌కే పరిమితమయ్యే పరిస్థితి వచ్చేసింది. మరో రెండేళ్లు అలానే గడిచాయి. అప్పుడే జరిగింది ఓ అద్భుతం. అది 1994 ఆగష్టు 17.. ఆ రోజంతా భీకరమైన ఉరుములు, మెరుపులతో వర్షానికి తెరిపన్నదే లేదు. తనకు చేతనైన చిన్నచిన్న పనులన్నీ పూర్తి చేసిన మేరీ.. స్నానం చేయడానికి ఇంటి బయటున్న బాత్రూమ్లోకి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఓ పిడుగు మీద పడింది. 10,000 వోల్టుల విద్యుత్.. మేరీని నేలకు విసిరికొట్టింది. కాసేపటికి గమనించిన కుటుంబసభ్యులు మేరీని ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్‌కి తరలించారు. రెండు రోజులకు ఆమె కళ్లు తెరిచింది. రౌండ్స్‌కి వచ్చిన డాక్టర్ గాయాలకు డ్రెసింగ్ చేస్తుంటే.. ఆమె ఎడమకాలిని తాకినట్లు స్పర్శ తెలిసింది. ఎన్నో ఏళ్లుగా చచ్చుబడిన ఆ కాళ్లల్లో కదలికలు మొదలయ్యాయి. వైద్యులు ఆశ్చర్యపోయారు. సరిగ్గా నెలరోజులు గడిచేసరికి వీల్ చైర్ పక్కన పెట్టి నడవడం మొదలుపెట్టింది. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే ఎవరి ఆసరా లేకుండా.. కాళ్లకు ఎలాంటి సపోర్ట్ బ్యాండ్స్ లేకుండా ఆమె చాలా దూరం నడవడం ఆ కుటుంబాన్ని నివ్వెరపరచింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని ప్రారంభించింది మేరీ. అది ఓ అద్భుతమని ఆమె నమ్మింది. 1995 ఏప్రిల్ 19న ప్రపంచానికి తన జీవిత కథ చెప్పడానికి సిద్ధపడి.. సమీపంలోని ఆల్ఫ్రెడ్ పి. ముర్రా ఫెడరల్ బిల్డింగ్‌లో రిపోర్టర్స్కి అపాయింట్మెంట్ ఇచ్చింది. అయితే అదే రోజు ఆ బిల్డింగ్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేసి 168 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ ఘటన ఆమెను నోరు మెదపనివ్వలేదు. తనకు జరిగిన మిరాకిల్ దైవరహస్యమని, దాన్ని చెబితే తనకే ప్రమాదమని భావించిందో ఏమో.. ఇక ఏ ఇంటర్వ్యూకీ ఒప్పుకోలేదు. అయితే 2003 నాటికి మేరీలో మళ్లీ ఆ వ్యాధి లక్షణాలు మొదలయ్యాయట. మరోసారి కాళ్లు నిర్జీవంగా మారిపోవడంతో నడవడం కష్టమైందట. సరిగ్గా రెండేళ్లకి ఇంటి ఆరుబయట ఆమె మళ్లీ పిడుగుపాటుకు గురై.. తిరిగి కోలుకుని నడవడం మొదలుపెట్టిందని, ఇక ఆమె పిడుగుపాటుకు గురికాకుండా ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిని ఏర్పరచారనే సమాచారం వచ్చింది. ఆమె మాత్రం ప్రపంచం ముందుకు రాలేదు. జరిగిందేమిటో వివరంగా చెప్పలేదు. ఇక రాన్.. 2016లో తన 68వ ఏట అనారోగ్యంతో కన్నుమూశాడు. తర్వాత కొడుకు క్రిస్టోఫర్ కూడా మరణించడంతో మేరీ వివరాలు బయటికి పొక్కలేదు. అసలు మేరీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఎక్కడుంది? ఏం చేస్తోంది? లాంటి వివరాలేవీ తెలియవు. ప్రాణాలతో ఉంటే ఇప్పటికి ఆమెకు 70 ఏళ్లు నిండి ఉంటాయి. ఈ కథలో.. పిడుగుపాటుకు ప్రాణాలు పోకపోగా, కొత్త ఎనర్జీ రావడం, ఉన్న వ్యాధులు మాయం కావడం ఓ మిరాకిల్ అయితే.. ఆ నిజాన్ని మేరీ తనంతట తాను ప్రపంచానికి వెల్లడించాలనుకున్న రోజే బాంబు దాడి జరగడం మరో పెద్ద మిస్టరీ! పిడుగులాంటి ఘటనలు ► అమెరికాలోని అలబామాకు చెందిన ఫెయిత్ మోబ్లీ కథ కూడా ఇలాంటిదే! ఆమె మెక్ డొనాల్డ్స్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురైంది. ఆ విద్యుత్ ఎనర్జీ.. ఆమె హెడ్సెట్ నుంచి షూ గుండా భూమిలోకి ప్రవహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే ఆమె ప్రాణాలతో బయటపడటంతో పాటు.. బలహీనంగా ఉన్న ఆమె కంటి చూపు పూర్తిగా మెరుగుపడిందట! ► రూబెన్ స్టీఫెన్సన్ అనే రైతు పొలంలో పని చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యాడు. అతడి పక్కనే ఉన్న రెండు గుర్రాలు చనిపోయాయి. కానీ అతడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే పెదవిపై ప్రాణాంతక మెలనోమాతో బాధపడుతున్న స్టీఫెన్ సన్.. పిడుగుపాటు తర్వాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడట! ► అమెరికాలోని జెర్సీలో ఒక పోలీసు అధికారి కూడా పిడుగుపాటుకు గురయ్యాడు. ఆ సమయంలో అతని కోటు కాలిపోయింది. ఇత్తడి బటన్లు కరిగిపోయాయి. కానీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి అప్పటిదాకా ఉన్న వాతం, అజీర్తి మాయమయ్యాయట! -
ఏళ్లు గడుస్తున్నా.. వీడని మిస్టరీ
కామవరపుకోట: హత్య జరిగి మూడేళ్లు గడుస్తున్నా హతురాలి వివరాలు గానీ, హంతకుల ఆచూకీ గానీ ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. 2015 ఏప్రిల్ 26న కామవరపుకోట మండలంలోని ఆడమిల్లి వద్ద పుంతలో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహం పడివున్న తీరును బట్టి ఆమెది హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన మహిళ శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండవచ్చని పోలీసులు భావించారు. మృతురాలి మెడ కింద తాడుతో బిగించిన గుర్తులున్నాయని, ఎక్కడో చంపి ఇక్కడ పడవేసి వుంటారని నిర్ధారణకు వచ్చారు. మృతురాలిని గుర్తు పట్టేందుకు నాలుగు పోలీసు బృందాలను పంపినట్టు అప్పట్లో జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపారు. ఇక్కడి ఫ్యాక్టరీలలో పని చేసేందుకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుంటారు. ఈ కారణంగా మృతురాలి ఆచూకీ కనుగొనేందుకు ఫ్యాక్టరీలలోని కార్మికులను పోలీసులు విచారించారు. ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించి ఇప్పటికి మూడేళ్లు దాటినా ఇంతవరకు చనిపోయిన మహిళ వివరాలేవీ పోలీసులకు లభ్యం కాలేదు. ఈమె ఊరు, పేరు తెలిస్తే మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 1997లోనూ కేసును ఛేదించలేకపోయిన పోలీసులు 1997లో జరిగిన హత్య కూడా ఎటూ తేలకుండానే మరుగున పడిపోయింది. 1997 డిసెంబరు 27న టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెం అడవిలోని జెండా గట్టుపై ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. శవాన్ని చూసిన అప్పటి ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వ్యక్తిక్లి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయని, ధృఢంగాను, ఆరోగ్యవంతంగాను ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి ముఖం గుర్తు పట్టేందుకు వీలు లేకుండా రాళ్లతో కొట్టారని తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశంలో బండరాయి, మద్యం సీసాలు, సిగరెట్లు, పేకలు, కాలిపోయిన తెల్లచొక్కా కాలర్ ముక్క, కాలిపోయిన పసుపు రంగు నైలాన్ తాడు, హవాయి చెప్ప్చును అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య జరిగి 21 సంవత్సరాలైనా హంతకులెవరో, హతుడెవరో ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు. -
టైమ్ కవర్ పై ఆ మిస్టరీ మహిళ ఎవరు?
వాషింగ్టన్ : లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మీ టూ క్యాంపెయిన్‌ను ప్రారంభించి.. విజయవంతంగా నడిపిన మహిళలు టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017గా ఎంపికైన విషయం తెలిసిందే. వారందరి ఫోటోలతో టైమ్ మ్యాగ్జైన్ కవర్‌పేజీపై ఓ ఫోటోను కూడా ప్రచురించింది. అయితే అందులో ఓ మహిళ ముఖానికి మాత్రం చూపించకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవర్ ఫోటో పై ఉద్యమకారిణి అడమ ఇవూ, నటి అష్లే జుడ్డ్, సింగర్ టైలర్ స్విఫ్ట్, మెక్సికన్ స్ట్రాబెర్రీ పిక్కర్ ఇసాబెల్ పాస్కల్, ఉబెర్ మాజీ ఇంజనీర్ సునాన్ ఫ్లవర్ ఉన్నారు. ఆరో మహిళ ముఖానికి మాత్రం చూపించకుండా కేవలం చేతిని మాత్రమే చూపించటంతో అది కాస్త చర్చనీయాంశంమైంది. దీనిపై టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంథాల్ స్పందించారు. ఆమె టెక్సాస్ కు చెందిన వ్యక్తని.. ఓ ఆస్పత్రిలో ఆమె పని చేస్తున్నారని తెలిపారు. లైంగిక వేధింపుల బాధితురాలైన ఆమె.. ఐడెంటీటి బయటపడితే తనతోపాటు తన కుటుంబ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని టైమ్ వారిని కోరిందంట. అందుకే ఆమె ఫోటోను ప్రచురించలేదని ఎడ్వర్డ్ చెప్పారు. మీటూ క్యాంపెయిన్‌లో పలువురి బండారాలను భయటపెట్టిన మహిళలు కూడా తమ ఫోటోలను ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని ఆయన అన్నారు. -
ఈ హీరోతో ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరో..
ముంబయి: ఇటీవల గాసిప్స్ విషయంలో కాస్తంత వెనుకబడిన రణ్‌బీర్ కపూర్ మరోసారి అలాంటి వార్తలతో తళుక్కున మెరిశాడు. మంగళవారం అతడు ఎవరికీ తెలియని ఒక కొత్త అమ్మాయితో ఉన్న ఫొటోలు ఇంటర్నెట్లోకి దూసుకురావడంతో గుసగుసలు గుప్పున అన్నాయి. పైగా కాస్తంత కండలు కూడా పెంచిన రణ్‌బీర్‌తో ఉన్న ఆ అమ్మాయి ఎబరబ్బా అంటూ అంత తెగ ఆలోచిస్తున్నారు. రణ్‌బీర్ మరోసారి ప్రేమలో పడ్డాడా? ఆ అమ్మాయి అతడి కొత్త గర్ల్‌ఫ్రెండ్? ఒక వేళ అదే నిజమైతే ఇలా అందరికీ తెలిసేలా ఫొటోలకు పోజులిచ్చి వాటిని వేరే వారికి దొరికేలా ఎందుకు చేస్తారని కూడా ప్రశ్నించుకుంటున్నారు. తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో జగ్గా జాసూస్ అనే చిత్రంలో నటిస్తున్న రణ్‌బీర్ బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జీవితకథను అధారంగా చేసుకొని వస్తున్న బయోపిక్‌లో సంజయ్గా నటించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం దాదాపు 13 కేజీల బరువు కూడా పెరిగిన రణ్‌బీర్ మరోసారి హాట్‌గా వార్తల్లో నిలిచాడు. బ్లూషార్ట్ షార్ట్స్, వైట్ టాప్‌లో ఉన్న ఎవరికీ తెలియని ఓ అమ్మాయితో రణ్‌బీర్ రోమాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. దీంతో అంతా ఆ యువతి రణ్‌బీర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ అని అనుకుంటున్నారు. అయితే, వాస్తవానికి ఆ ఫొటోలు ఓ కొత్త బ్రాండ్‌కు ప్రకటనలో భాగంగా చేసినవంట. ఈ ఫొటోలో నిజంగానే అతడు సంజయ్ పాత్రకోసం కోసం బాడీని పెంచి చాలా ఫిట్‌గా కనిపించాడు. -
మిస్టరీ మహిళ కోసం వేట..!
న్యూఢిల్లీ: ఆమె వయసు ఇప్పుడు 32. పేరు క్రిస్టీన్ బ్రెడో స్ల్పీడ్. చిరునామా ఫ్లాట్ నంబర్ 3, 10 చాప్ స్టోవ్ రోడ్, లండన్. డీటెయిల్స్ ఇంత క్లియర్ గా ఉన్నా ఇప్పటికీ ఆమె మిస్టరీ మహిళే. ఎందుకంటే ఈ వివరాలు ఒరిజినలా? ఫేకా? ఇంకా తెలియాల్సిఉంది. ప్రస్తుతం భారత రాజకీయాలను కుదిపేస్తోన్న అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంలో ఈ మిస్టరీ మహిళదే ప్రధాన పాత్ర పోషించినట్లు భారత దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆమేరకు ఆమె గురించిన సమాచారాన్ని సేకరించేకొద్దీ క్రిస్టీన్.. వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంత నేర్పరో తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఈ కుంభకోణంలోకి ఎలా ఎంటర్ అయిందంటే.. డెన్మార్క్ కు చెందిన క్రిస్టీన్ బ్రెడో చిన్నవయసులోనే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. 20 ఏళ్ల వయసులోనే బీటెల్ నట్ హోమ్ అనే బ్రిటిష్ కంపెనీలో షేర్ హోల్డర్ అయింది. ఈ సంస్థ యజమాని మరెవరోకాదు.. అగస్టా స్కామ్ లో భారత నేతలకు ముడుపులు ముట్టచెప్పడంలో ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటిష్ పౌరుడు క్రిస్టియన్ జేమ్స్ మిచెల్ ది. ఆయనకే చెందిన గ్లోబల్ సర్వీసెస్ సంస్థ(దీనిని దుబాయ్ కేంద్రంగా ఏర్పాటుచేశారు)లోనూ క్రిస్టీన్ ప్రధాన వాటాదారు. అలా వాళ్లిద్దరి మధ్య నెలకొన్న స్నేహమే క్రిస్టీన్ ను అగస్టా కుంభకోణంలోకి లాక్కొచ్చింది. జేమ్స్ మిచెల్ కు అత్యంత నమ్మకమైన మనిషిగా క్రిస్టీన్.. ఆయన తరఫున భారత నేతలతో మాట్లాడేదని, వ్యక్తిగంగానూ నిందితులను కలుసుకుందని దర్యాప్తు సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. 12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన డీల్ నిర్ణయం మొదలుకొని, పూర్తయ్యేవరకు ఆమె భారత్ కు పలుమార్లు వచ్చిపోవడం కూడా కుంభకోణంలో ఆమె పాత్రను నిర్ధారిస్తున్నాయి. భారత నేతల తరఫున మధ్యవర్తిత్వం వహించిన గౌతమ్ పారేఖ్ ను విచారించడం ద్వారా దర్యాప్తు సంస్థలు క్రిస్టీన్ కు సంబంధించిన వివరాలు సేకరించారు. 2010 ఫిబ్రవరిలో క్రిస్టీన్ ఇండియాకు వచ్చారు. అదేనెల 8న అగస్టా డీల్ కు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. 15న ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన క్రిస్టీన్ అక్కడేఉన్న క్రిస్టియన్ మిచెల్ ని కలుసుకుంది. మళ్లీ 24న భారత్ కు వచ్చి బ్యాలెన్స్ వ్యవహారలు చక్కబెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటలీ కోర్టు 2012లో విచారణకు ఆదేశించింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 30న క్రిస్టీన్ మరోసారి ఇండియాకు వచ్చి నిందితులను కలుసుకుంది. 2013 జనవరిలో దుబాయ్ వెళ్లి మిచెల్ కు ఇక్కడి(భారత్) వ్యవహారాలను తెలిపింది. 3,600 కోట్ల డీల్ ను కుదిర్చినందుకుగానూ ఫిన్ మెకానికా (అగస్టా వెస్ట్ లాండ్ బ్రాండ్ హెలికాప్టర్ల తయారీ సంస్థ) జాన్ మిచెల్ కు 26 మిలియన్ పౌండ్లు చెల్లించుకుంది. అందులో భారీ మొత్తం క్రీస్టీనాకు దక్కి ఉండొచ్చని అనుమానం. అయితే ఈ చెల్లింపుల వ్యవహారం, భారత నేతలకు లంచాలు ఇవ్వజూపడాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. గాంధీ కుటుంబానికి సంబంధించిన నేతల పేర్లు చెప్పాలని సీబీఐ తనను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. దర్యాప్తు సంస్థ మాత్రం మిచెల్ చెప్పేవన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తోంది. క్రిస్టీన్ ను విచారించగలిగితే మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆమె కోసం వేట మొదలైంది. వీవీఐపీలు వినియోగించేందుకు 12 హెలికాప్టర్లు కొనాలనుకున్న భారత ప్రభుత్వం.. రోమ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్ లాండ్ కు 3,600 కోట్ల కాంట్రాక్టును అప్పచెప్పింది. అయితే అసలు విలువలో భారీ మొత్తాన్ని లంచాల రూపంలో మింగేశారని, ఒప్పందం కుదుర్చుకునే విషయంలో మధ్యవర్తిత్వం చోటుచేసుకుందని, డీల్ మొత్తం అస్తవ్యస్తంగా ఉందంటూ ఇటాలియన్ కోర్టు దర్యాప్తునకు ఆదేశించడంతో అగస్టా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో భారత్ లోనూ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.