లాల్ జోస్
సినిమా ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంపై కొందరు నటీనటులు తమ అభిప్రాయాలను వివిధ సందర్భాల్లో పంచుకున్నారు. తాజాగా మీటూ ఉద్యమం గురించి మలయాళగ దర్శకుడు లాల్ జోస్ మాట్లాడుతూ– ‘‘సినిమా షూటింగ్ సమయంలో నా తోటి వారితో కొన్నిసార్లు కోపంగా, మరికొన్నిసార్లు స్నేహపూర్వకంగా ఉంటాను. పురుషులు, మహిళలనే బేధం లేకుండా అందరితో ఒకేలా మాట్లాడతాను.
అయితే నేను ఆగ్రహం వ్యక్తపరిచినప్పుడు ఎవరు ఎలా తీసుకుంటారో నేను ఊహించలేను. అందుకే ‘మీటూ’ వచ్చాక నా టీమ్‌లోకి మహిళలను తీసుకోవడానికి భయంగా ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం సెట్‌లో నా ప్రవర్తన బాగోలేదని ఓ పాపులర్ లేడీ ఫొటోగ్రాఫర్ నాపై ఆరోపించారు. అయితే అది నిజం కాదు. ఇప్పుడు మీటూ ఉద్యమం ఒక భయాన్ని క్రియేట్ చేసిందని నా అభిప్రాయం. కానీ ఈ భయం మంచికా? లేక చెడుకా? అనేది చెప్పలేం’’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment