‘మీటూ’ ఓ ఫ్యాషన్ లాంటిది. ఎక్కువ కాలం నిలబడదు’ అనే వ్యాఖ్యలు చేశారు మోహన్‌లాల్. అయితే ప్రకాశ్‌రాజ్ ఈ స్టేట్‌మెంట్‌తో ఏకీభవించలేదు. ‘‘మోహన్‌లాల్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడి ఉంటారని నేను అనుకోను. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. కానీ ఇలాంటి విషయాలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్థాయి వ్యక్తి నుంచి సొసైటీ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది’’ అన్నారు. మీటూ గురించి మాట్లాడుతూ– ‘‘ఇలాంటి ఉద్యమాలు స్త్రీలను మరింత ధైర్యవంతులను చేస్తాయి. సాధికారత వైపు నడిచేలా చేస్తాయి. చాలా మంది, నాతో సహా ఏదో ఒక సమయంలో స్త్రీలపై తెలిసో, తెలియకో దాడి చేసి ఉండొచ్చు. స్త్రీలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉన్నారంటే తప్పు చేసిన వాళ్లను ప్రోత్సహించినట్టే. ఈ విషయంలో వాళ్లు పడుతున్న బాధ నిజమైంది. మనం గుడ్డివాళ్లలాగా ప్రవర్తించొద్దు. ‘మీటూ’ లాంటి ఉద్యమాల్లోని లోతుని అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment