
నటి శ్రుతీహరిహరన్
సినిమా: నటుడు అర్జున్‌ను వదిలేదు లేదు అంటోంది నటి శ్రుతీహరిహరన్. దక్షిణాదిలో యాక్షన్‌కింగ్‌గా పేరుతెచ్చుకున్న నటుడు అర్జున్. అలాంటి నటుడు ఇప్పుడు మీటూలో చిక్కుకున్నాడు. నిపుణన్ చిత్రంలో నటిస్తున్న సమయంలో అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆ చిత్ర కథానాయకి శ్రుతీహరిహరన్ చేసిన ఆరోపణలు కలకలానికి దారి తీయడంతో పాటు నటుడు అర్జున్ ఇమేజ్‌ను డామేజ్ చేశాయి. అయితే శ్రుతీహరిహరన్ ఆరోపణల్లో నిజం లేదంటూ అర్జున్ పేర్కొనడంతో పాటు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటి శ్రుతీహరిహరన్ కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కన్నడ సినీ ప్రముఖులు కొందరు రాయబారం నడిపినా ఫలితం లేకపోయ్యిందనే ప్రచారం జరుగుతోంది.
అర్జున్‌తో రాజీకి నటి శ్రుతీహరిహరన్ ససేమీరా అంటోందని సమాచారం. దీంతో శ్రుతి ఆరోపణలతో పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో నటుడు అర్జున్ బెంగళూర్ కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. అయినా అర్జున్‌ను వదిలేది లేదంటోంది నటి శ్రుతీహరిహరన్. ఈమె ఈ విషయమై బెంగుళూర్‌లోని మహిళా కమిషన్‌ను ఆశ్రయించి అర్జున్‌పై ఫిర్యాదు చేసి ఆయనపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. దీనిపై శ్రుతీహరిహరన్ ఒక భేటీలో పేర్కొంటూ తాను అర్జున్‌పై చేసిన ఆరోపణలకన్నింటికీ ఆధారాలున్నాయని అంది. ఆయనపై ఫిర్యాదు చేసినందుకుగానూ తనపై అర్జున్ కేసు వేశారని చెప్పింది. దాన్ని తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, అదే విధంగా తాను చేసిన ఆరోపణలకు కోర్టులో ఆధారాలను సమర్పిస్తానని అంది. అదేవిధంగా అర్జున్ మద్దతుదారులు తనను బెదిరిస్తున్నారని, ఆ విధంగా అర్జున్ దొరికిపోయాడని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆయన్ని వదిలేదని శ్రుతీహరిహరన్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment