మీ టూ సుడిలో స్వామీజీ | Metoo Complaint Against Karnataka Swamyji | Sakshi
Sakshi News home page

మీ టూ సుడిలో స్వామీజీ

Published Thu, Nov 22 2018 12:34 PM | Last Updated on Thu, Nov 22 2018 12:34 PM

Metoo Complaint Against Karnataka Swamyji - Sakshi

ఆరోపణలు చేస్తున్న మహిళ

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: సినీ రంగాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల ‘మీటూ’ విస్తరిస్తోంది...తాజాగా బుధవారంనాడు ఒక మహిళ... స్వామీజీ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదంటూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో కాస్త మీడియా దృష్టికి వెళ్లడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా వనకల్లు మఠం బసవ రమానంద స్వామీజీ పై ఆ మహిళ ఈ ఆరోపణలు చేసింది. ఆమె వీడియోలో మాట్లాడుతూ..  స్వామీజీ పని ఇప్పిస్తానని చెప్పి ఒంటరిగా మఠానికి పిలిపించి అత్యాచారం చేశాడని పేర్కొంది. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని, నీ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ సంఘటన జరిగాక 7 నెలల క్రితం డాబస్‌పేట పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, స్వామీజీపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరపకుండా డాబస్‌పేట ఎస్సై శంకర్‌ నాయక్‌ బీ–రిపోర్టు వేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించింది.

కక్షతో చేయిస్తున్నారు: రమానందస్వామీజీ  
రమానంద స్వామీజీ స్పందిస్తూ, ఇవన్నీ తనపై కక్షతో మధుమయానంద స్వామీజీ ఆ మహిళతో నాటకం ఆడిస్తున్నాడని, ఆమెతో పరిచయమే లేదని, ఎటువంటి వైద్య పరీక్షలకయినా తాను సిద్ధమని ప్రకటించారు. ఒకవేళ ఈ ఆరోపణ రుజువయితే మఠాన్ని వదిలి ప్రాణత్యాగం చేసుకుంటానని సవాలు చేశారు. ఆ మహిళతో తనకు కూడా పరిచయంలేదని, పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసి ఆమెకు మద్దతుగా మాత్రమే నిలిచానని మధుమయానందస్వామి చెబుతున్నారు. ఒక మహిళ, ఇద్దరు స్వామీజీల మధ్య గొడవ ఎక్కడికి వెళ్తుందోనని వనకల్లు మల్లేశ్వర మఠం భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement