సాక్షి బెంగళూరు: నటి శ్రుతి హరిహరన్ ఫిర్యాదు చేసిన 15 గంటల తర్వాత పోలీసులు అర్జున్ సర్జా సన్నిహితుడు ప్రశాంత్ సంబర్గిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. గత రాత్రి ప్రశాంత్‌పై నగరంలోని హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌లో శ్రుతి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నుంచి విమర్శలు రావడంతో ప్రశాంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రశాంత్‌పై ఐపీసీ సెక్షన్ 506 (బెదిరింపు), 509 (మహిళను అవమానించేలా మాట్లాడడం) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు అర్జున్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో దాఖలు చేసిన కేసులపై పోలీసులు స్పందిస్తున్నారు. ఈ కేసులో శ్రుతికి పోలీసులు నోటీసులుజారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఫిర్యాదు ఏంటి?
శుక్రవారం ఫిల్మ్ చాంబర్‌లో జరిగిన సమావేశానికి హాజరైన సమయంలో అక్కడ తన వివాదా నికి సంబంధించి కొంతమంది వ్యక్తులు తనను దుర్భాషలు ఆడినట్లు, అర్జున్ సర్జా సన్నిహితు డు ప్రశాంత్ కొంతమంది గుండాలతో గుమిగూ డి తనను దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో శ్రుతి పేర్కొన్నారు. అంతేకాకుండా చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నారని తెలిపారు. అర్జున్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఈ సమయంలో తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ప్రతిలో శ్రుతి పేర్కొన్నారు.
కోర్టులో విచారణ...
నటి శ్రుతి హరిహరణ్ విరుద్ధంగా అర్జున్ వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ మేయోహాల్ కోర్టు ముందుకు వచ్చింది. శుక్రవారం ఈ కేసు కు సంబంధించి న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రుతి తరఫున అడ్వొకేట్ కొఠారియా తమ వాదన వినిపించేందుకు గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి ఈ కేసు విచారణను 29కు వాయిదా వేశారు.
తనకు బెదిరింపులు : తాను మీటూ గురించి మాట్లాడిన తర్వాత బెదిరింపులు ఫోన్ కాల్స్ వచ్చాయని కన్నడ నటి హర్షికా పూణచా తెలిపారు. బెదిరింపులకు తాను భయపడనని తెలిపారు. మీటూ వివాదంలో తాను ఎవరిపక్షం కాదని, అలాగని ఎవరికి వ్యతిరేకం కూడా కాదని తెలిపారు. మీటూ వివాదంపై మాట్లాడుతుంటే చాలా మంది పబ్లిసిటీ అని మాట్లాడుతున్నారని, ఇది సరికాదని తెలిపారు. కొంతమంది పబ్లిసిటీ కోసం కూడా వివాదాలు సృష్టిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment