
సాక్షి, కర్నూలు: నారా లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. దళితులు ఏం పీకారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దళిత సంఘాలు ఆయనను అడ్డుకున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో లోకేష్ ఏం చేయాలో తెలియక తెల్లమొహం వేసుకున్నాడు.
కాగా.. దళితులపై నారా లోకేశ్ నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రలో లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి లోకేశ్ చేరుకున్నారు. జక్కసానిపల్లిలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగానే దళితులు పీకిందేమీ లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చదవండి: Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు