Dalit activist
-
కర్నూలు: లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
సాక్షి, కర్నూలు: నారా లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. దళితులు ఏం పీకారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దళిత సంఘాలు ఆయనను అడ్డుకున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో లోకేష్ ఏం చేయాలో తెలియక తెల్లమొహం వేసుకున్నాడు. కాగా.. దళితులపై నారా లోకేశ్ నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రలో లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి లోకేశ్ చేరుకున్నారు. జక్కసానిపల్లిలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగానే దళితులు పీకిందేమీ లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చదవండి: Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు -
బీఎస్పీ తదుపరి చీఫ్ దళిత వర్గం నుంచే..
లక్నో: ‘నేనిప్పుడు ఫిట్‌గానే ఉన్నాను. అన్‌ఫిట్‌గా మారడానికి ఇంకా చాలా సంవత్సాలు పడుతుంది. కాబట్టి నా తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తిని ఇప్పుడే ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు దళిత వర్గం నుంచే ఎంపిక ఉంటుంది’ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ సతీశ్ మిశ్రా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా కరోనా ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడలేదని ఆమె అన్నారు. ఆరోగ్యం సహకరించనప్పుడే పార్టీ పగ్గాలను వేరేవారికి అప్పగిస్తానని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో పార్టీతో ఉన్న వారికే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. బీఎస్పీ స్థాపకుడు కాన్షీరాం కూడా తన ఆరోగ్యం క్షీణించాకే తదుపరి చీఫ్‌ను ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 24 పేజీల బుక్లెట్ గురించి ఆమె స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తమ ర్యాలీలకు, సమావేశాలకు డబ్బు, ఆహారం ఎరగా వేసి ప్రజలను రప్పిస్తుందని విమర్శించారు. ప్రజల మద్దతును కాంగ్రెస్ కోల్పోయిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో క్యాంపెయిన్‌కోసం పారిశ్రామి కవేత్తలపై ఆధారపడుతోందని, కానీ బీఎస్పీ మాత్రం ఆర్థికంగా స్థితిమంతులు కాని వారికి కూడా టికెట్లు ఇస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌లా తమ పార్టీ పెట్టుబడిదారుల పార్టీ కాదని పేదలు, అణగారిన వారి పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ వ్యవహరించే రెండు నాల్కల ధోరణి వల్లే ఆ పార్టీకి ఈ గతి పట్టిందన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టినట్లు వ్యాఖ్యానించారు. -
టీడీపీ నేత దాష్టీకం.. దళిత దంపతులపై దాడి
పెదకూరపాడు: ప్రశ్నించిన దళితులపై టీడీపీ నేతలు, సానుభూతి పరుల దాడులు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. పొలం వద్ద జరిగిన చిన్న వాగ్వాదం విషయమై మాట్లాడదాం రండి అని దళిత దంపతులను పిలిచి, కర్రలతో దాడి చేసి కులం పేరుతో దూషించి, పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్న ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం హుస్సేన్‌నగరం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని హుస్సేన్‌నగరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన సాతులూరి లక్ష్మయ్య, దేవకరుణ దంపతులు కౌలుకు పొలం సాగు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఆ పొలంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత నెల్లూరు బుల్లెబ్బాయి గోర్రు తోలారు. 13వ తేదీ సాయంత్రం లక్ష్మయ్య, దేవకరుణ పొలం చూసేందుకు వెళ్లగా.. గోర్రు సక్రమంగా తోలకపోవడంతో బుల్లెబ్బాయిని ప్రశి్నంచారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయమై మాట్లాడదాం రండి అని దంపతులను గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు నెల్లూరు మల్లికార్జునరావు తన ఇంటికి అదే రోజు సాయంత్రం పిలిపించారు. దంపతులు జరిగిన విషయం చెబుతుండగానే.. పొలంలో గొర్రు తోలిన నెల్లూరు బుల్లెబ్బాయి లక్ష్మయ్యను మాపై ఫిర్యాదు చేస్తావురా అంటూ కాలితో తన్నగా.. బుల్లెబ్బాయి కుటుంబసభ్యులు నెల్లూరి బోస్‌బాబు, శివయ్య, రోశయ్య, పవన్, అరుణ, రమాదేవి, రమాదేవి కోడలు, బుల్లెబ్బాయి భార్య కర్రలతో దాడి చేశారు. కులం పేరుతో దూషించారు. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్గంమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో దళిత దంపతులు అర్ధరాత్రి సమయంలో అమరావతి మండలం అత్తలూరు మీదగా 75తాళ్ళూరు వచి్చ, అక్కడ నుంచి పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెదకూరపాడు సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించుకుని.. అమరావతి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గుంజి తిరుమలరావు తెలిపారు. -
ఆవిర్భావ దినోత్సవం రోజే టీడీపీకి షాక్
సాక్షి, విజయవాడ: ఆవిర్భావ దినోత్సవం రోజే తెలుగుదేశంపార్టీకి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి 400 మంది టీడీపీ దళిత కార్యకర్తలు చేరారు. వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగు నాగార్జున, ఎంపీ సురేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ, దళితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఆలోచించే గొప్ప నేత సీఎం జగన్ అని మేరుగు నాగార్జున కొనియాడారు. ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప సంక్షేమం లేదని, దళితులంటే ఆయనకు చిన్నచూపు అని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో దళితుల భూములు లాక్కుని మోసం చేశారని విష్ణు ధ్వజమెత్తారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. -
మూడుసార్లు బెయిలు నిరాకరణ.. ఎవరీ నవ్‌దీప్ కౌర్!
‘‘భయపడొద్దు తల్లీ. ఓటమిని అంగీకరించొద్దు. చివరివరకు మనం పోరాడాలి. లేకుంటే వీళ్లు మనల్ని బతకనివ్వరు.’’ – నవ్‌దీప్ కౌర్ తల్లి. ‘‘కొన్నిసార్లు పోరాటమే మార్గం అవుతుంది. ఆ మార్గంలోనే మా అక్క నడుస్తోంది’’ – నవ్‌దీప్ కౌర్ చెల్లెలు రాజ్వీర్ కౌర్. ‘‘అతివాద మూకలు మన ఫొటోను మంటల్లో తగలబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ఇండియాలో ఉంటే ఏం జరుగుతుందో ఊహించండి’’. – నవ్‌దీప్ కౌర్‌ను విడుదల చేయాలని కోరుతూ ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తున్న ఒక యువతి ఫొటోను, ఉద్యమకారుల పోస్టర్లు తగలబెడుతున్న వారి ఫొటోనూ జత చేస్తూ కమలా హ్యారీస్ చెల్లెలి కూతురు మీనా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు. పంజాబ్ యువతి. వయసు 23. ప్రస్తుతం ఆమె పంజాబ్‌లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఇరవై మూడేళ్ల ఈ దళిత యువతికి మొదట ఆమె తల్లి, చెల్లి మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఈ నెల 6న మీనా షేర్ చేసిన పోస్టుతో యావద్దేశమే కాదు, అమెరికాలోనూ నవ్‌దీప్‌ను వెంటనే విడుదల చేయాలని అక్కడి ఎన్నారైలు డిమాండ్ చేస్తున్నారు! జనవరి 12న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నేటికి 28 రోజులు. మూడుసార్లు కోర్టు ఆమెకు బెయిలు నిరాకరించింది! ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేయడం, ఆ ప్రాంతంలోనే తను పని చేస్తున్న ఫ్యాక్టరీలో కొందరిని అకారణంగా తొలగించడాన్ని ప్రశ్నించడం ఆమె చేసిన నేరాలు! వ్యక్తిగా ఆమె నిరసన తెలియజేసినంత కాలం మౌనంగా ఉండి, అవకాశం కోసం చూస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఆమె ‘మజ్దూర్ అధికారం సంఘటన్’ (మాస్)లో సభ్యురాలిగా చేరి ఒక్క నినాదం ఇవ్వగానే అరెస్ట్ చేయించి, జైల్లో పెట్టించింది. ఫ్యాక్టరీలో మహిళా కార్మికులపై జరుగుతున్న అఘాయిత్యాలను ‘మాస్’ అండతోనే బయటపెట్టగలిగారు నవ్‌దీప్ కౌర్. పర్యవసానమే.. జైలు నుంచి ఆమె బయటికి వచ్చే ద్వారాలు మూసుకుని పోవడం. నవ్‌దీప్ కౌర్‌కు మద్దతుగా కమలా హ్యారిస్ చెల్లెలి కూతురు మీనా పెట్టిన ట్వీట్. ‘‘జైల్లో మా అక్కను చిత్రహింసలు పెడుతున్నారు. ఆమె కాళ్ల మధ్య నుంచి రక్తం స్రవించడాన్ని తాము చూసినట్లు సహ ఖైదీలు మా అమ్మకు సమాచారం పంపారు. అమ్మ బాధపడింది. కానీ భయపడలేదు. ‘పోరాడకపోతే మన బతుకులు ఎప్పటికీ ఇంతే’ అని వర్తమానం పంపింది. మా అక్కడ ధైర్యవంతురాలు. కడవరకు పోరాడుతూనే ఉంటుంది’’ అని రాజ వీర్ కౌర్ తనని కలిసిన మీడియా ప్రతినిధి ఆస్తా సవ్యసాచితో అన్నారు. రాజ్వీర్ ఢిల్లీ యూనివర్సిటీలోనే చదువుతోంది. అక్కను బయటికి తెప్పించేందుకు ఆమే స్వయంగా ఎప్పటికప్పుడు లాయర్‌తో మాట్లాడుతోంది. వారి కుటుంబంలో రాజ్వీర్ ఒక్కరే ఇంత చదువు వరకు వచ్చింది. అక్క నవ్‌దీప్, తమ్ముడూ స్కూల్లో ఉండగానే చదువు మానేశారు. లాక్డౌన్ సమయంలో చేసిన పీకల్లోతు అప్పుల నుంచి తల్లిదండ్రులను గట్టెక్కించడానికి పంజాబ్ నుంచి ఢిల్లీ వచ్చి ఫ్యాక్టరీలో పనికి చేరారు. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మీదే ఆమెను, ‘మాస్’ అధ్యక్షుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవ్‌దీప్ కౌర్ పంజాబ్‌లోని దళిత సామాజిక వర్గమైన ‘మఝబీ సిక్కు’ల అమ్మాయి. నాలుగు నెలల క్రితమే ఆమె పని కోసం ఢిల్లీలో ఆ ఫ్యాక్టరీలో చేరారు. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా ఉద్యమిస్తున్న రైతులతో గొంతు కలిపారు. ఇవన్నీ కూడా ఆమెను అక్రమంగా జైల్లో వేయించడానికి తోడ్పడ్డాయి. జైల్లో పెట్టిన రెండో రోజే.. జనవరి 14 నాటికి.. నడవలేని స్థితికి చేరుకున్నారు నవ్‌దీప్. వైద్య పరీక్షల్లో ఆమె రక్తస్రావానికి లైంగిక అకృత్యాలే కారణం అని నిర్థారణ అయినట్లు బయటికి పొక్కింది. మగ పోలీసులు ఆమెను జననావయంపై లాఠీతో కొట్టిన గుర్తులు బయటపడ్డాయి. జైల్లో నుంచి ఆమె ప్రాణాలతో బయటపడతారా అన్నదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. చదవండి: కష్టాలను ఎత్తి కుదేయండి తల్లిదండ్రులున్నా అనాథగా పెరిగా -
రౌడీ రాజకీయం మాకొద్దు
తిరుపతి రూరల్: మీరు చిత్తూరులో రౌడీ కావచ్చు. మీకు శత్రువర్గం ఉండవచ్చు. హత్యలు చేసుకునేంత శత్రుత్వం ఉండవచ్చు. కానీ ప్రశాంత చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం రౌడీ రాజకీయం వద్దని వైఎస్సార్సీపీ నాయకులు హేమేంద్రకుమార్‌రెడ్డి, మస్తాన్, చెన్నకేశవరెడ్డి, బాబురెడ్డి, ఎంపీటీసీలు నాగరాజు, సీఎం కేశవులు కోరారు. చంద్రగిరి మండలం మొరవపల్లికి చెందిన పుట్టా రవిపై పులివర్తి నాని అనుచరుల హత్యాయత్నంకు నిరసనగా బుధవారం దళితులు, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రగిరి క్లాక్ టవర్ సెంటర్లోనూ, పూతలపట్టు పోలీసు స్టేషన్ ఎదుట వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాస్తారోకో చేశారు. దాడి చేసిన పులివర్తి నాని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో కులం, మతం, పార్టీ, రాజకీయం అంటూ శత్రుత్వాలు ఉండవన్నారు. ఇక్కడ ప్రజలు ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తారని, తర్వాత ఆప్యాయంగా ఉంటారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని చోట్టా అందరు నాయకులు పాల్గొంటారని తెలిపారు. మండల సమావేశాల్లో సైతం సమస్యలపైనే తప్ప పార్టీల జోలికి వెళ్లరని గుర్తు చేశారు. అలాంటి ప్రశాంత నియోజకవర్గంలో మీరు చేస్తున్న బెదిరింపులను ఆపాలని తెలిపారు. చేయిస్తున్న దాడులను అరికట్టాలని, దయచేసి ప్రజలను భయందోళనలకు గురిచేయవద్దని వేడుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఉదయం లేస్తే ఎవరి బతుకుదెరువు కోసం వారు వెళ్తారని, అలాంటి బడుగుజీవులను భయపెట్టవద్దన్నారు. దళితుల జీవితాలతో ఆటలొద్దు రాజకీయాల కోసం దళితుల జీవితాలతో ఆటలొద్దని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. దళితుడిపై హత్యాయత్నం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో దళితులపై ఇలాంటి భౌతిక దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు అందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి, పూతలపట్టు సీఐలకు వినతి పత్రాలు అందజేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తకు ఎమ్మెల్యేల పరామర్శ తిరుపతి రూరల్: పులివర్తి నాని అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి మండలం మొరవపల్లి చెందిన పుట్టా రవిని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణస్వామి, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. రవి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, యశ్వంత్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
యోగికి దళిత మిత్ర వద్దన్నందుకు అరెస్ట్
లక్నో : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ మహాసభ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు దళిత మిత్ర అవార్డు అందజేసింది. దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న యోగికి ఈ అవార్డు ఇవ్వడమేమిటంటూ నిరసన వ్యక్తం చేసిన దళిత కార్యకర్తలు ఎస్ఆర్ దారాపురి, హరీశ్ చంద్ర, గజోదర్ ప్రసాద్, చౌరాసియాలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు కూడా అంబేద్కర్ మహాసభ సభ్యులు కావడం గమనార్హం. ఏ ప్రాతిపదికన అవార్డు ఇచ్చారు..? యోగి ఆదిత్యనాథ్‌కు దళిత మిత్ర అవార్డు అందజేయడం వల్ల అంబేద్కర్ మహాసభ సభ్యుల మధ్య విభేదాలు చెలరేగాయి. సభ్యులందరినీ సంప్రదించకుండానే అధ్యక్షుడు లాల్జీ నిర్మల్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ ఐపీఎస్ అధికారి, మహాసభ సభ్యుడు ఎస్ఆర్ దారాపురి ఆరోపించారు. యోగి ఈ అవార్డుకు అనర్హులంటూ మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేందుకే లాల్జీ నిర్మల్.. యోగిని ఈ అవార్డుకు ఎంపిక చేశారని ఆరోపణలు చేశారు. 30 కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లు : యోగి గవర్నర్ రామ్‌నాయక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం యోగి ప్రసంగించారు. మోదీ సర్కారు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. 30 కోట్ల మంది దళితులకు బ్యాంకు అకౌంట్లు తెరిచే అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ ఆశయాలను పాటిస్తూ ఆయన గౌరవాన్ని పెంపొందిస్తున్న ఏకైక వ్యక్తి మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ మహాసభ అధ్యక్షుడు లాల్జీ నిర్మల్ మాట్లాడుతూ..దళితుల కోసం యోగి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. -
దళిత రాజకీయాలే కీలకమా?
జాతిహితం మైనారిటీలు, దళితులు, ఆదివాసుల నుంచి ఏ ఒక్కరూ నేడు కేంద్రంలో కీలక మంత్రు లుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో మినహా మరెక్కడా సీఎంలుగా లేరు. ఈ పరిస్థితే మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. బీజేపీ ఈ ముప్పును లెక్కచేయడం లేదు. దేన్నయినా జయించగల సమున్నత శక్తినని అది భావిస్తోంది. దళిత ఐక్యత వల్ల కలిగే ముప్పును మొగ్గలోనే తుంచేయగలనని అది భావిస్తోంది. కాబట్టే దళితుల ఆందోళనల పట్ల అతిగా ప్రతిస్పందిస్తోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. దళితులు మన జాతీయ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తిగా ఆవిర్భవించనున్నారా? దళిత ఆత్మవిశ్వాసంగా ఇటీవల అభివర్ణిస్తు న్నది కేవలం సామాజిక–రాజకీయపరమైనదేనా లేక జోరుగా సాగనున్న ఈ ఎన్నికల ఏడాదిలో వర్తమాన రాజకీయాల ధోరణిని బద్దలుకొట్టే శక్తి దానికి ఉన్నదా? ఉన్నట్టయితే, ఆ రాకెట్లో మే 2019 వరకు సరిపడేటంత ఇం«దనం ఉన్నదా? లే క అంతకంటే ముందుగానే కొడిగట్టిపోతుందా? ఈ ప్రశ్నల పరం పరను మరో రెండు ప్రశ్నలతో ముగిద్దాం. ఈ నూతన అంశం జిగ్నేశ్ మెవానీ రూపంలో వ్యక్తమౌతోందా? రాజకీయ పరిభాషలో ఆయన సరికొత్త కాన్షీరాం కానున్నారా? లేక మహేంద్రసింగ్ తికాయత్ లేదా రిటైర్డ్ కల్నల్ కిశోరీసింగ్ బైంస్లాల వంటి వారు మాత్రమేనా? నేను చెప్పదలుచుకున్న అంశమైతే ఇదే.. కాన్షీరాం దేశ ప్రధాన భూభాగంలోని రాజకీయాలను ప్రగాఢంగా ప్రభావితం చేశారు. మిగతా ఇద్దరికీ వివిధ సమయాల్లో జాట్లు, గుజ్జర్ల మద్దతున్నా క్రమంగా తెరమరుగయ్యారు. దళిత ఓటర్లను సంఘటితం చేయగలరా? దేశ ఓటర్లలో దాదాపు 16.6 శాతం ఉండే దళితులు నిజానికి ముస్లింల కంటే మరింత శక్తివంతమైన ఓటు బ్యాంకు. కేరళ, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే 1989కి ముందు కాంగ్రెస్ దళితులంతా తమ ఓటర్లేనని భావించగలిగేది. 1989 నుంచి కాంగ్రెస్ వెనుకబడిన కులాలు, ముస్లింలతో పాటూ దళితుల ఓట్లను కోల్పోవడం మొదలైంది. ముస్లింలకు భిన్నంగా దళితులు ఎన్నడూ వ్యూహాత్మకంగా లేదా ఒక పార్టీని ఎన్నుకోవాలి లేదా మరో పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలి అనే ఏకైక లక్ష్యంతో ఎన్నడూ ఓటు చేయలేదు. ఉత్తరప్రదేశ్, బిహార్ సహా చాలా కీలక రాష్ట్రాల్లో దళితుల ఓట్లు కాంగ్రెసేతర పార్టీలకు వెళ్లాయి. బీజేపీకి అది ఉపయోగపడింది. దళి తులలో కొందరు నరేంద్ర మోదీ పట్లా్ల, ఇటీవలి కాలంలో ఆ పార్టీ పట్ల కూడా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తదుపరి దశలో... జాతీయ రాజ కీయాల్లో ఏమంత ప్రాధాన్యం లేనంతగా దళితుల ఓట్లు చీలిపోయాయి. మరోవిధంగా కూడా ముస్లింలకంటే దళితులు విభిన్నమైన ఓటర్లు. దళితుల ఓట్లు వివిధ రాష్ట్రాల్లో బాగా చెల్లా చెదురుగా ఉన్నాయి. కాబట్టి ముస్లింల వలే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల శక్తిని కోల్పో యారు. ఉత్తరప్రదేశ్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. దళిత ఓటర్లు అత్య ధికంగా ఉన్నది పంజాబ్‌లో (32%). కానీ వారిలో చాలా మంది సిక్కులు. ఆ రాష్ట్రంలో ఓటర్లు కులం ప్రాతిపదికపై సమీకృతం కారు. కానీ పెద్ద సంఖ్యలో ఎవరి ఓట్లయినా ఒక పక్షంవైపు మొగ్గితే బలాబలాలు తారుమారు అవు తాయి. అందువల్ల మనం ముందు వేసిన ప్రశ్నల సారం ఒక్కటే.. దళిత ఆత్మ విశ్వాసానికి ప్రాతినిధ్యం వహిస్తూ, వారికి నాయకత్వం వహిస్తున్న మెవానీ దళిత ఓట్లను అలా సంఘటితం చేయగలరా? ఆ పని చేయగలిగితే అది ప్రస్తుత రాజకీయాల ధోరణిని భగ్నం చేయగలుగుతుంది. మెవానీ దళిత నేతగా ఆవిర్భవించినా ఆయన చాలా రాష్ట్రాలకు విస్తరిం చిన జనాకర్షణశక్తిగల నేత కూడా కావాల్సి ఉంటుంది. దళితులను అందరినీ సమీకరించగలిగిన ఒక నేత అవసరం. 1970ల మధ్య వరకు జగ్జీవన్‌రాం కాంగ్రెస్‌కు అలాంటి నేతగా ఉండేవారు. ఆ తర్వాత మరో దళిత నేతకు అలాంటి సాధికారతను కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. దాదాపు 8 శాతం ఓటర్లుగా ఉన్న ఆదివాసులకు చెందిన అలాంటి జాతీయ స్థాయి నేత ఏ పార్టీకీ, ప్రత్యేకించి కాంగ్రెస్‌కు (పీఏ సంగ్మా తర్వాత) లేరు. ఈ విష యంలో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానం. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నా అది లెక్కలోకి రాదు. దళిత ఐక్యతకు అందివచ్చిన అవకాశం మైనారిటీలు, దళితులు, ఆదివాసులలో ఎవరూ కేంద్రంలో కీలక మంత్రులుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్యాలను మినహా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా లేని ఆసక్తికరమైన పరిస్థితి నేడుంది. సరిగ్గా ఇదే జిగ్నేశ్ మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ముప్పును లెక్కచేయనంతటి రాజకీయ చతురత మోదీ–షాల బీజేపీకి ఉంది. దేన్నయినా జయించేయగల సమున్నత శక్తిననే ఆలోచనా ధోరణి దానిది. కాబట్టి తలెత్తగల ఆ ముప్పుతో తలపడి సాధ్యమైనంత త్వరగా, మొగ్గలోనే తుంచేయాలని ఆ పార్టీ భావిస్తుంది. క్షేత్రస్థాయిలో దళి తులు కార్యాచరణకు దిగడం పట్ల వారు అతిగా ప్రతిస్పందించడంలో అదే వ్యక్తమౌతోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. ఉనాలో గోరక్షకులు దళితులపై సాగించిన అత్యాచారం నేపథ్యంలో మెవానీ నేతగా ముందుకు వచ్చారు. తొలుత ఆయనను గుజరాత్‌కే పరిమి తమైన స్థానిక నేతగానే చూశారు. రాజకీయంగా పెద్దగా లెక్కలోకి తీసుకోవా ల్సిన వాడిగా చూడలేదు. ఆయన రాజకీయాల్లో మొదట్లో సాంప్రదాయ కమైన ఎన్నికల రాజకీయాలను మెచ్చని జేఎన్‌యూ తరహా భావజాలం కని పించింది. అదికాస్తా ఆయన ఎన్నికల బరిలోకి దిగాలని, అది కూడా బూర్జువా జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో కూటమి కట్టాలని నిర్ణయించు కోవ డంతోనే అది ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రస్తుతం గుజ రాత్‌లోని ఒక ఎంఎల్ఏ మాత్రమే. అయినా అంతకంటే చాలా ఎక్కువ గానే లెక్కలోకి వస్తారు. ఇతర రాష్ట్రాలలోని దళితులకు తన సందేశాన్ని విని పించే అవకాశాన్ని కూడా అది ఆయనకు కల్పిస్తుంది. ఈ వారంలో ఆయన మహా రాష్ట్రలో చేసినది సరిగ్గా అదే. మెవానీలో చాలా బలమైన అంశాలు చాలానే ఉన్నాయి. యవ్వనం, అద్భుత వాక్పటిమ, సామాజిక మాధ్యమాలను ఉపయోగించగల శక్తిసామ ర్థ్యాలు, రాజకీయ, భావజాలపరమైన పట్టువిడుపుల గుణం ఆయనకు న్నాయి. అంతేకాదు, ఇప్పటికి ఏకైక శత్రువు బీజేపీ మాత్రమేనంటూ దానిపైకే గురిపెట్టి... మిగతా వారందరితోనూ కలవగల దృష్టి కేంద్రీకరణ కూడా ఉంది. పైగా ఆయన దళితులలోని ప్రధానమైన ఒక ఉపకులానికి చెంది నవారు. ఆయన వచ్చింది చిన్న రాష్ట్రం నుంచి, అయితే ఆయనకు ముందు కాన్షీరాం కూడా ఆయనలాగే ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చి జాతీయస్థాయిలో అత్యంత ప్రబలమైన రాజకీయ ధోరణిని నిర్మించారు. అది ఆయనకు అను కూలంగా పనిచేసే మరో బలీయమైన అంశం అవుతుంది. పంజాబీ అయిన కాన్షీరాం కూడా సాంప్రదాయకంగా చెప్పుకోదగినది కాని ప్రాంతం నుంచి రంగం మీదకు వచ్చారు. డీఆర్డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ, అంబేడ్కర్ రచనలతో ప్రభావితుడై ఆయన షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాన్ని (బీఏఎంసీఈఎఫ్) నిర్మించడంతో ప్రారంభించారు. అప్పటివరకు దళితులు అనే పదం పెద్దగా వాడుకలో లేదు. మొదట్లో ఆయన పతాకశీర్షికలకు ఎక్కా లని తాపత్రయపడేవారిలా కనిపించారు. 1980ల చివరి కాలం అస్థిరమైనది, కాంగ్రెస్ క్షీణిస్తూ పలు వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. కాన్షీరాం చూపిన రాజకీయ చతురత ఉందా? సిక్కు వేర్పాటువాద నేతలు సహా రకరకాల గ్రూపులను ఆయన ఒక్క చోటికి చేర్చి భారీగా ప్రజలను సమీకరించారు. అయినా ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. త్వరలోనే ఆయన తన శక్తిని పెంచుకుని, వారందరినీ వదిలించే సుకున్నారు. తన రాజకీయాలు వృద్ధి చెందాలంటే మెవానీ కూడా ఉమర్ ఖలీద్‌ను విడిచిపెట్టాలి. దేశ ప్రధాన భూభాగంలో వేళ్లూనుకోనిదే జాతీయ వాదాన్ని లేదా మతాన్ని ఢీకొంటూ దళిత రాజకీయాలను నిర్మించలేమని కాన్షీరాం 30 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. దాన్ని మెవానీ గుర్తించాలి. అయితే, కాన్షీరాంగానీ, మాయావతిగానీ హిందూయిజాన్ని తిరస్కరించలేదు లేదా బౌద్ధాన్ని స్వీకరించలేదు. ‘‘మన పోరాటం హిందూ దేవతలతో కాదు మను వాదులతో’’ అనే వారాయన. ఇక బుద్ధుడంటారా? మను వాదులు మూడు కోట్ల దేవతల్లో ఒకడిని చేసేస్తారు అంటుండేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రముఖంగా ముందుకు వచ్చినది 1988లో. బోఫోర్స్ కుంభకోణం విష యంలో రాజీవ్‌ను తప్పు పడుతూ వీపీ సింగ్ ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. అదేసమయానికి అమితాబ్ బచ్చన్ రాజీనామా చేయ డంతో అలహాబాద్ పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది. వీపీ సింగ్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి, లాల్‌బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రికి మధ్యనే పోటీ జరుగుతున్నదని మేం అంతా అనుకున్నాం. కొన్ని రోజుల ప్రచారం జరిగే సరికే కాన్షీరాం నిర్ణయాత్మక శక్తిగా ముందుకు వచ్చారు. అప్పుడే మేం మొదటిసారిగా సూటిగా సరళంగా దళిత రాజకీయాలను విన్నాం : ‘‘40 ఏళ్లుగా మనం జంతువుల్లా బతికాం. మనుషులుగా బతకా ల్సిన సమయం వచ్చింది.’’ ఆయన ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత రూప కల్పన చేసిన రాజకీయాల్లో మూడు అంశాలు కొట్టవచ్చిట్టు కనిపించేవి. ఒకటి, అస్పష్టంగానైనా వేర్పాటువాది అనిపించిన వారెవరైనా వారిని ఆయన దూరంగా ఉంచేవారు. రెండు, తన కుటుంబ జాతీయవాద, సైనిక వారసత్వాన్ని పదే పదే ఏకరువు పెడుతుండేవారు. అంతేకాదు, తన ప్రచా రాన్ని కూడా సైనిక పద్ధతుల్లోనే నిర్వహించేవారు: ప్రింటింగ్ బ్రిగేడ్, పాంప్లెట్ బ్రిగేడ్, దళిత బస్తీల్లో డబ్బాలు పట్టుకుని చందాలు సేకరించే బిచ్చగాళ్ల బ్రిగేడ్లను నిర్మించేవారు. వాళ్లిచ్చే డబ్బు ఎంత అని కాదు. ‘‘ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒకసారి ఒక రూపాయి ఇచ్చాడంటే, కాంగ్రెస్ వెయ్యి రూపాయలిచ్చినా దానికి ఓటు వేయడు’’ అనేవారు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది. ఆయన తన శిబిరాన్ని సువిశాలంగా మార్చారు. బహుజన సమాజ్ అనే నిర్వచనంతో ఇతర వర్గాలన్నిటినీ ఆకర్షించడానికి ప్రయత్నిం చారు. అలాగే ఆయన ఓట్లు మావి, అధికారం మీదా/ ఇక చెల్లదు, ఇక చెల్లదు అనే నినాదాన్ని తయారుచేశారు. తర్వాతి కాలంలో అధికారంలోకి రావడా నికి ముస్లింలను, కొన్ని ఉన్నత కులాలను కూడా కలుపుకుపోవాలని ఆయన, మాయావతి గుర్తించారు. అదే వారిని అధికారంలోకి తెచ్చింది. ఓడినా మాయావతిని ఇంకా ప్రబల శక్తిగా నిలిపింది. దళిత కౌటిల్యునిగా కాన్షీరాం తన మేధస్సుతో మాయావతిని తన చంద్రగుప్తునిగా తయారుచేశారు. మెవానీకి అలాంటి నైపుణ్యం, ప్రతిభ, తదేక దృష్టి ఉన్నాయా? చెప్పడం కష్టమే. కానీ, బీజేపీ, హిందూ ఉన్నత వర్గాలకు చెందిన మితవాదశక్తులూ ఆయన గురించి ఆందో ళన చెందడమే ఆ విషయాన్ని విశదం చేస్తుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
దళిత కార్యకర్తకి సీఎం క్షమాపణలు!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం మూడురోజల పంజాబ్ పర్యటనను ప్రారంభించారు. ఆయన బుధవారం లంబీ నియోజకవర్గంలో కీలక ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ నియోజకవర్గమైన ఇక్కడ ఢిల్లీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌ను బరిలోకి దింపాలని ఆప్ భావిస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని బుధవారం కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకున్న సీఎం కేజ్రీవాల్ మంగళవారం దళిత కార్యకర్త, గాయకుడు బంత్‌సింగ్ జబ్బార్‌కు క్షమాపణలు చెప్పారు. పంజాబ్‌లోని మాన్సాకు చెందిన బంత్‌సింగ్ కూతురు రేప్ బాధితురాలు. బంత్‌సింగ్ ఇటీవల ఆప్‌లో చేరగా.. మరోసభలో ఆయనపై దాడి చేసిన నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఆప్‌లో చేరారు. దీంతో బంత్‌సింగ్ నివ్వెరపోయారు. ఈ విషయం తెలియడంతో ఆప్ ఆ ఇద్దరు నిందితుల్ని వెంటనే పార్టీలోంచి తొలగించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కేజ్రీవాల్ బంత్‌సింగ్‌ను వ్యక్తిగతంగా కలిసి సముదాయించారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. ఇది పొరపాటేనని నిజాయితీగా ఒప్పుకొంటున్నాం. జరిగిన దానికి మేం సిగ్గు పడుతున్నాం. పార్టీలో చేరిన ఆ నిందితుల్ని వెంటనే తొలగించాం' అని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. -
నామ్‌దేవ్ ఢసాల్ ఇకలేరు
సాక్షి, ముంబై: ప్రముఖ కవి, దళిత పాంథర్ సంస్థపాకుడు పద్మశ్రీ నామ్‌దేవ్ ఢసాల్(64) బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబైలోని బాంబే ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో వెంటనే ఐసీయూలోకి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వడాలాలోని అంబేద్కర్ కళాశాల ప్రాంగణంలో ఉంచనున్నారు. ఆ తరువాత శివాజీపార్క్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన సన్నిహితులు తెలి పారు. పుణే జిల్లాలోని ఓ కుగ్రామంలో 1949, ఫిబ్రవరి 15న జన్మించారు. బతుకుదెరువు కోసం ముంబై చేరుకున్న ఢసాల్ దళితుల న్యాయం కోసం అనేక పోరాటాలు చేశారు. 1972లో దళిత్ పాంథర్‌ను స్థాపించి రాష్ట్ర రాజకీయాలతోపాటు కేంద్రంలో కూడా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత అనేక మంది నాయకులు ఆయణ్ని విడిచిపెట్టి సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు. అయినప్పటికీ కడ వరకూ ఆయన పాంథర్లోనే కొనసాగారు. ముంబై టీ జాక్ సంతాపం ఢసాల్ మృతి పట్ల పలువురు నాయకులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు ఢసాల్ సేవలు, త్యాగాలను మరోసారి నెమరేసుకున్నారు. దళిత సమాజం కోసం ఆయన చేసిన పోరాటలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియాడారు. ఢసాల్ మృతిపై ప్రొఫెసర్ కోదండరామ్, కంచె ఐలయ్య తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ముంబై టీ జాక్ అధ్యక్షుడు మూల్నివాసి మాల తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.హేమంత్‌కుమార్, సంగెవేని రవీంద్ర తదిత రులు పాల్గొన్నారు.