
సాక్షి, విజయవాడ: ఆవిర్భావ దినోత్సవం రోజే తెలుగుదేశంపార్టీకి షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీలోకి 400 మంది టీడీపీ దళిత కార్యకర్తలు చేరారు. వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగు నాగార్జున, ఎంపీ సురేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ, దళితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.
సామాజిక న్యాయం కోసం ఆలోచించే గొప్ప నేత సీఎం జగన్ అని మేరుగు నాగార్జున కొనియాడారు. ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప సంక్షేమం లేదని, దళితులంటే ఆయనకు చిన్నచూపు అని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో దళితుల భూములు లాక్కుని మోసం చేశారని విష్ణు ధ్వజమెత్తారు.
చదవండి:
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం..
Comments
Please login to add a commentAdd a comment