సాక్షి, తిరుపతి: అక్కినేనిపై బాలకృష్ణ వ్యాఖ్యలను మంత్రి ఆర్కే రోజా ఖండించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఏఎన్‌ఆర్‌పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదు. చాలా తప్పు. చాలా సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ ఆలోచించాలి’’ అని మంత్రి రోజా అన్నారు.
కాగా, నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు.
చదవండి: బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్!
Comments
Please login to add a commentAdd a comment