సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఈరోజు(గురువారం) ప్రారంభం కాగా, టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేసి సభలో హంగామా సృష్టించారు. టీడీపీ సభ్యులు అతి చేయడంతో అసెంబ్లీ ప్రారంభం కాగానే వాయిదా పడింది. వాయిదా తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైనప్పటికీ టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టి ఫైళ్లు విసిరేశారు.
టీడీపీ సభ్యుల ఆందోళన సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే విజ్ఞప్తి చేసినా వారు తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ సభ్యులు సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ కాగా, కొంతమందిపై ఒకరోజు సస్పెన్షన్ పడింది. సభలో బాలకృష్ణ సభలో మీసాలు తిప్పి రెచ్చగొట్టే చర్యలకు శ్రీకారం చుట్టాడు. దాంతో అసెంబ్లీ రెండోసారి వాయిదా పడింది.
అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సాక్షి టీవీతో మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. ‘పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారు. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్ విసిరేసి, బాటిల్స్ పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉంది.
బావ కళ్లలో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నాడు. బాలకృష్ణ సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ. తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చాడు. తనకు ఓటేసిన హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడైనా బాలకృష్ణ మాట్లాడాడా?, అక్రమంగా ప్రజల డబ్బును దోచేసి చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు. చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటికి తీస్తాం. దమ్ముధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలి. ఎంత సేపైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
చదవండి: అసెంబ్లీలో బాలకృష్ణ ఓవరాక్షన్.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment