సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు సభకు చర్చకోసం లేదని, రచ్చ కోసం వచ్చారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. బాలకృష్ణకు చంద్రబాబు సీటు మీద మనసు లాగినట్లుందని.. అందుకే బావ కుర్చీ ఎక్కి విజిల్స్ వేసి పిచ్చి పిచ్చి వేశాలేశాడని విమర్శించారు. అసెంబ్లీలో తొడగొట్టడం కాదని, చేతనైతే హైకోర్టుకు పోయి జడ్జి ముందు తొడకొట్టాలని బాలకృష్ణకు చురకలించారు. బాలకృష్ణకు రోషం లేదా మా బావ తుప్పు కాదు.. నిప్పు అని ఒప్పుకోవడానికి బాలకృష్ణకు మనసు రావడం లేదా అని ప్రశ్నించారు.
ఈ మేరకు మంత్రి రోజా శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బాలకృష్ణ, టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. సోమవారం వస్తారో... మంగళవారం వస్తారో.. బుధవారం వస్తారో మీ ఇష్టం, స్కిల్ స్కామ్ మొదలు చంద్రబాబు అన్ని స్కాములపైనా చర్చిద్దామని చాలెంజ్ చేశారు. బాలకృష్ణ సినిమాల్లో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు. అసెంబ్లీకి వచ్చి మా బావ తప్పు చేయలేదు..ఈడీ ఎంక్వైరీ వేయండి అని అడగాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి బహిరంగ చర్చకు రమ్మని లోకేష్ సవాల్ విసురుతున్నాడని. తనకెలాగూ సభకు వచ్చే సీన్ లేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
టీడీపీ నేతలకు చిన్న మెదడు చితికింది
లోకేష్ తన మామ బాలకృష్ణను సభకు పంపించాలని, తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి రోజా తెలిపారు. టీడీపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందని విమర్శించారు. వ్యవస్థలను దోచుకున్న చంద్రబాబు ఎన్నికల ముందు ఇలా దొరికిపోయానేంటో అనే భయంలో ఉన్నారని, టీడీపీ నేతలకు చిన్నమెదడు చితికి ఏం మాట్లాడుతున్నారో అర్ధ కావడం లేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలను తీర్చే బదలు ప్రజలకు సమస్యగా మారారని దుయ్యబట్టారు. ఇక తమ నాయకుడైన వైఎస్ జగన్ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
చదవండి: టీడీపీ భయపడుతోంది.. బాలకృష్ణ విజిల్స్ సిగ్గుచేటు
ఏపీ ప్రజల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలి
‘చంద్రబాబు ఆ జాతికి పిత కాబట్టి ఎల్లో మీడియా తెగ బాధపడుతోందని మంత్రి రోజా దుయ్యబట్టారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారని తెలిపారు. ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు జైలుకి పోతే.. సీఎం జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ దొంగ చంద్రబాబు సాష్టాంగపడి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ దోచుకుని పక్కరాష్ట్రంలో ప్యాలెస్‌లు కట్టిన చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలని పేర్కొన్నారు.
అసెంబ్లీలో మాట్లాడటం చేత కాదా?
టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చి ఎందుకు పారిపోయారు. చంద్రబాబు స్కామ్ చేశాడు దోచుకున్నాడని టీడీపీ నేతలకు కూడా తెలుసు. అందుకే పచ్చ ఛానల్స్‌లో కవరింగ్ ఇవ్వడానికి సభలో గందరగోళం సృష్టించారు. టీడీపీ నేతలకు కూడా స్కిల్ స్కామ్‌లో వాటా ఉందా?. బాలకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదు?. బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమే డైలాగ్ చెప్పడం వచ్చా?. అసెంబ్లీలో మాట్లాడటం చేతకాదా?. ముందుండి పార్టీని నడిపిస్తానని చెప్పిన ఆయన ఎందుకు పారిపోయాడు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ స్కామమ్‌కు పథకం వేశాడు. జీవోలో లేనప్పుడు ఒప్పందాలపై ఎలా సంతకాలు చేశారు’ అని మంత్రి రోజా పేర్కొన్నారు.
చదవండి: పట్టాభిరామ్ ఓవరాక్షన్‌పై టీడీపీ నేతల సీరియస్
స్కిల్ స్కామ్‌పై చర్చ ఉందని తెలిసే టీడీపీ నేతలు రకరకాల విన్యాసాలు చేశారు. నోటితో సమాధానం చెప్పలేక విజిల్స్‌తో విన్యాసాలు చేసినా ప్రభుత్వం సంయమనం పాటించింది. సమాధానం చెప్పలేకే టీడీపీ నేతలు పారిపోయారు. త్వరలోనే లోకేష్‌కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది. టీడీపీ నేతలకు దమ్ముంటే సభకు హాజరై చర్చలో పాల్గొనండి. మీ నేత తప్పు చేయలేదని నమ్మితే సభకు రండి.
-ప్రభుత్వ విప్, కరణం ధర్మశ్రీ
చట్టసభలంటే టీడీపీ నేతలకు గౌరవం లేదు. చంద్రబాబు పాపం పండి కటకటాల పాలయ్యాడు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. బాలకృష్ణ ఒక మెంటల్ కేసు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉంది.
-ఎమ్మెల్సీ,పోతుల సునీత
Comments
Please login to add a commentAdd a comment