బాలకృష్ణ ఇప్పటికైనా మేలుకో.. ఇదే నా సలహా: మంత్రి అంబటి  | Minister Ambati Rambabu Key Comments On Balakrishna | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ఇప్పటికైనా మేలుకో.. ఇదే నా సలహా: మంత్రి అంబటి 

Published Fri, Sep 22 2023 9:42 AM | Last Updated on Fri, Sep 22 2023 11:52 AM

Minister Ambati Rambabu Key Comments Over Balakrishna - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం తిప్పాల్సింది అసెంబ్లీ కాదు.. టీడీపీ పార్టీలో అని హితవు పలికారు మంత్రి అంబటి రాంబాబు. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగంలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. 

టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు.. రచ్చ..
కాగా, మంత్రి అంబటి రెండోరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై సరైన ఫార్మాట్‌లో రాకుండా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారు. చంద్రబాబు అవినీతిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు.. రచ్చ. శాసనసభలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేయాలనేదే టీడీపీ ఉద్ధేశం. చంద్రబాబు అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.  ఈరోజైనా సరైన ఫార్మాట్‌లో చర్చకు రావాలని కోరుతున్నాం. చిత్తశుద్ధి ఉంటే రండి చర్చిద్దాం. మీ వాదనలను మీరు వినిపించండి.. మా వాదనలు మేం వినిపిస్తాం. చంద్రబాబు అవినీతి చేయలేదని మీకు నమ్మకం ఉంటే.. చంద్రబాబు తప్పు చేయలేదని మీరు నిజంగా నమ్మితే చర్చలో పాల్గొనండి, పారిపోవద్దు. 

బాలకృష్ణ ఇదే సరైన సమయం..
గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్‌గా ఉన్నాడు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి. జన్మనిచ్చిన తండ్రికి, క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.  ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చింది. మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో ఉన్నారు. ఇదే మీకు సరైన సమయం. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మీకు నేను సలహా మాత్రమే ఇస్తున్నాను. పాటిస్తే పాటించు.. పాటించకపోతే అథపాతాళానికి పోతారు. 

దమ్ముంటే చర్చకు రండి..
మీకు మీ నాయకుడు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే కమాన్ చర్చలో పాల్గొనండి. ప్రజలే నిర్ణయిస్తారు.. ఎవరు తప్పుచేశారో. ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది చర్చకు రండి. చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఉన్నారు. నేను లేచి నిలబడకపోతే స్పీకర్ మీద దాడి చేసేవారు. పేపర్ లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోంది. ఈరోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారు అని అన్నారు. 

ఇది కూడా చదవండి: శవాలను వెతుకుతున్న యెల్లో రాబందులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement