అచ్చెన్నా.. నీకెందుకంత నోటి దురద  | Kinjarapu Atchannaidu Comments Controversial in Srikakulam TDP | Sakshi
Sakshi News home page

అచ్చెన్నా.. నీకెందుకంత నోటి దురద 

Published Fri, Feb 25 2022 1:20 PM | Last Updated on Fri, Feb 25 2022 1:22 PM

Kinjarapu Atchannaidu Comments Controversial in Srikakulam TDP - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ‘అచ్చెన్నకు ఎందుకంత నోటి దురద.. అంత తల బిరుసు ఎందుకు.. టిక్కెట్‌ ఇస్తాడో.. పోతాడో తర్వాత సంగతి. మనిషిని మనిషిగా గుర్తించాలి. నాయకులంటే అంత చులకనా. చెక్కులిస్తే తీసుకుంటారా? ఆస్తి రాసిస్తే వాడుకుని వదిలేస్తారా? పబ్లిక్‌ మీటింగ్‌లో ఆ వాగుడేంటి? టీడీపీలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న చర్చి ఇది.  

‘మా సామాజిక వర్గ నాయకుడుంటే అంత చిన్న చూపా? వాడు, వీడు అంటూ సంబోధనేంటి? అచ్చెన్నాయుడికి ఎందుకంత అహంకారం? మా సామాజికవర్గంపై నీ పెత్తనమేంటి? నోరు అదుపులో పెట్టుకోకుండా చేస్తున్న అజమాయిషీ ఏంటి? మా సామాజికవర్గ నేతను నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటి? మమ్మల్ని అవమానపరచడం, తొక్కేయడం ఆయనకు అలవాటైపోయింది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అచ్చెన్నకు బుద్ధి చెబుతాం.. ’ఏకవచనంతో అవమానకర మాటలకు గురైన మామిడి గోవిందరావు సామాజిక వర్గంలో పెల్లుబుకుతున్న ఆవేదనిది.   

పార్టీ లేదు.. ––– లేదు అన్నారంటే అది పార్టీ వ్యవహారం. కానీ, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకుడ్ని, పార్టీకి, నియోజకవర్గంలో కేడర్‌కి చేతనైనంత సాయం చేస్తున్న నేతను పట్టుకుని పబ్లిక్‌ మీటింగ్‌లో అనుచితంగా మాట్లాడటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మునిగిపోతున్న పార్టీని కాస్త నోరున్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే అంతా అనుకున్నాం. అచ్చెన్నాయుడు పర్వాలేదని భావించాం. కానీ ఇప్పుడాయన పార్టీని పాతాళంలోకి తొక్కేసేలా మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.   పార్టీ పగ్గాలు అప్పగించిన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌నే.. ‘వాడే మంచిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది.. చట్నీ వెయ్‌’ అని తిరుపతిలో అన్నప్పుడే అచ్చెన్నాయుడు నైజమేంటో తెలిసిపోయింది. లోకేష్‌నే గుర్తించని వాడు.. జిల్లాలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులపై నోటికొచ్చినట్టు వాగడం పెద్ద విషయమేమి కాదని కూడా టీడీపీలో చర్చించుకుంటున్నారు. 

‘ఆడొచ్చి చంద్రబాబునాయుడికి ఏదో చెక్కిచ్చాడు, చెక్కు కాదు కదా ఆయన ఆస్తి మొత్తం రాసిచ్చినా సరే పార్టీ అతన్ని వాడుకుంటది, వాడుకొని వదిలేస్తది..’ అని అంటే...ఒక నాయకుడికి ఎంత బాధగా ఉంటుంది..  నాయకుడికి గాని, ఒక కార్యకర్తకు గాని, పార్టీ వాడుకొని వదిలేస్తుందా, ఆస్తి మొత్తం రాసిచ్చేయమన్నా కూడా పార్టీ అతన్ని పట్టించుకోదు అన్న మాట ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనాల్సిన మాటేనా. కింద స్థాయి కేడర్‌ అన్నా, నియోజకవర్గంలో పనిచేసే నాయకులన్నా అచ్చెన్నకు చులకనని టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. టిక్కెట్‌ ఇస్తారో..పోతారో తర్వాత సంగతి.. ముందు నాయకుల్ని గౌరవించుకోవడం నేర్చుకోవాలని అచ్చెన్నకు ఘాటుగానే సోషల్‌ మీడియాలో టీడీపీ శ్రేణులు రిప్లై ఇస్తున్నాయి. మొత్తానికి మామిడి గోవిందరావునుద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్‌ కావడమే కాకుండా టీడీపీలోనూ, ఓ సామాజిక వర్గంలోనూ రచ్చకు దారితీశాయి.  

ఆ పార్టీ నాయకులకు నా సానుభూతి..  
‘చెక్కులేంటి.. ఆస్తి రాసి ఇచ్చినా లాక్కుందాం. వాడిని అలాగే వాడుకొని వదిలేద్దాం’ అంటూ నియోజకవర్గ స్థాయి నేతనే అన్నాడంటే టీడీపీలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది టీడీపీ పాత సిద్ధాంతమే అయినా అచ్చెన్న కొత్తగా చెప్పాడు. ఇక ఆ పార్టీలో ఉన్న నాయకులకు నా సానుభూతి.  
– ట్విట్టర్‌ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement