
Kriti Sanon Sensational Comments on Star Heroes: అందం, అభినయంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కృతి సనన్. ‘1నేనొక్కడినే’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆ అమ్మడు నటించిన బచ్చన్ పాండే మూవీ ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కృతి తాజాగా స్టార్ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసింది.
హీరోలకు సమానంగా హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఉండటం లేదని పేర్కొంది. సినిమాల్లో హీరోయిన్‌కి 60శాతం ఇంపార్టెన్స్ ఉండి, హీరో పాత్రకి 40 శాతమే ఇంపార్టెన్స్ ఉంటే.. అందులో పేరున్న హీరోలెవరూ నటించడానికి ఆసక్తి చూపించరు. ఈ కారణంగానే గతంలో నేను నటించిన చిత్రాల్లో పలువురు స్టార్స్ నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.
ఈ ధోరణి మారాలిని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇక ఆత్రంగి రే చిత్రంలో పాత్ర చిన్నదైనా అక్షయ్ కుమార్ నటించడానికి ఒప్పుకున్నాడని, ఇది చాలా మంచి విషయమని చెప్పుకొచ్చింది.