The Kashmir Files Director Vivek Ranjan Agnihotri Slams Prakash Raj - Sakshi
Sakshi News home page

Prakash Raj vs Vivek Agnihotri: ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌

Published Fri, Feb 10 2023 3:48 PM | Last Updated on Fri, Feb 10 2023 6:01 PM

The Kashmir Files Director Vivek Ranjan Agnihotri Slams Prakash Raj - Sakshi

విలక్షణ నటడు ప్రకాశ్‌ రాజ్‌ ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ, ఆ మూవీ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నహోత్రిపై చేసిన సంచలన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇటీవ కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌ రాజ్‌ ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘కశ్మీర్‌ ఫైల్స్‌ ఓ చెత్త సినిమా అని, ఆ సినిమాపై ఇంటర్నేషనల​ జ్యూరీ ఉమ్మివేసిందంటూ వివాదాస్పదంగా స్పందించాడు. దీంతో ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. దీంతో తాజాగా ఆయన కామెంట్స్‌ కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌ స్పందించాడు.

చదవండి: బాలుని చూడటానికి వెళ్లలేదు.. నన్ను రావద్దన్నారు: పి సుశీల

ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ను అంధకార్‌ రాజ్‌ అంటూ ప్రస్తావించాడు ఆయన. ఈ మేరకు వివేక్‌ అగ్ని హోత్రి ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడిన వీడియోను షేర్‌ చేస్తూ కౌంటర్‌ ఇచ్చాడు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. “జనాలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ అర్బన్ నక్సల్స్‌కు నిద్రలేకుండా చేసింది. అలాంటిది వీక్షకులను మొరిగే కుక్కలు.. అని పిలుస్తూ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిస్టర్ ‘అంధకార్ రాజ’.. భాస్కర్ ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను” అంటూ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

చదవండి: హీరో అవుదామని ఆశగా మద్రాస్‌ వెళితే హేళనగా మాట్లాడారు..మానసిక క్షోభకు గురయ్యా: మెగాస్టార్‌

ప్రస్తుతం వివేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఈవెంట్‌లో ప్రకాశ్‌ రాజ్‌ మాట్టాడుతూ.. పఠాన్‌ మూవీ ప్రశంసిస్తూ.. కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. ది కశ్మీర్‌ ఫైల్స్‌ అనేది ఓ చెత్త సినిమా. దాన్ని సినిమా ఎవరు నిర్మించారో తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement