
సాక్షి, హైదరాబాద్: తాను చేసిన వీడియోలో ఏ మతాన్నీ కించపర్చలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తాను మాట్లా డలేనని తెలిపారు. తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. బీజేపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సమాధానం ఇస్తానని చెప్పారు.
తాను ఇచ్చే వివరణతో పార్టీ సంతృప్తి చెందు తుందని, బీజేపీ తనను వదులుకోబోదని భావిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కాగా స్వామి పరిపూర్ణా నంద బుధవారం రాజాసింగ్ నివాసానికి వెళ్లి కలిశారు. రాజాసింగ్‌ను పరామర్శించి, అరెస్టుకు దారితీసిన పరిణామాలు, అరెస్ట్, అనంతరం విడుదల, కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment