కలకత్తా: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీపై బీజేపీ నేత దిలీప్‌ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ కూతురునని చెప్పుకుంటున్న మమతాబెనర్జీ తన తండ్రి ఎవరో ముందు డిసైడ్ చేసుకోవాలన్నారు. దిలీప్‌ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
‘మమత గోవా వెళ్లి గోవా బిడ్డనంటుంది. త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత ముందు నిర్ణయించుకోవాలి’ అని ఘోష్ వ్యాఖ్యానించారు.ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు.
గతంలో దుర్గా మాతపై, ఇప్పుడు మమతా బెనర్జీపై ఘోష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నైతికంగా ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. కాగా, 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వాడిన ‘బెంగాల్ వాంట్స్ టు గో విత్ డాటర్’ నినాదం బాగా పాపులర్ అయింది. ఆ ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment