Pavitra Lokesh Ex Husband Suchendra Prasad Sensational Comments On Her, Details Inside - Sakshi
Sakshi News home page

Pavitra Lokesh Ex Husband: నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సంచలన ఆరోపణలు!

Published Thu, Mar 16 2023 7:02 PM | Last Updated on Thu, Mar 16 2023 7:41 PM

Pavitra Lokesh Ex Husband Suchendra Prasad Sensational Comments on Ex Wife - Sakshi

సినీ నటుడు నరేష్‌-పవిత్రా లోకేష్‌లు పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు మార్చి 10న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినట్లు నరేష్‌ ప్రకటించాడు. మీ ఆశీర్వదాలు కావాలంటూ పెళ్లి వీడియో షేర్‌ చేశాడు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి వ్వవహరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేక మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో షేర్‌ చేశారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా నరేశ్‌కు ఇది నాలుగవ పెళ్లి కాగా.. పవిత్రకు మూడో పెళ్లి అనే విషయం తెలిసిందే.

చదవండి: హీరోగా కొడుకు లుక్‌ షేర్‌ చేస్తూ మురిసిపోయిన యాంకర్‌ సుమ

అయితే వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చిన అనంతరం పవిత్ర మొదటి భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్‌ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్‌గా ఆయన కన్నడ మీడియాతో ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవిత్ర-నరేష్‌​ పెళ్లిపై సుచేంద్రకు ప్రశ్న ఎదురవగా మాజీ భార్యపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తాజా బజ్‌ ప్రకారం సుచేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్లాన్‌ ప్రకారమే పవిత్ర నరేష్‌కు దగ్గరైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడట. అంతేకాదు ‘పవిత్ర లగ్జరీ లైఫ్‌ కోసం ఆమె ఏమైనా చేస్తుంది. ఆస్తి కోసమే నరేష్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపింది. డబ్బు కోసం ఆమె ఎంతకైన దిగజారుతుంది.

చదవండి: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: లాస్య ఎమోషనల్‌ పోస్ట్‌

కేవలం డబ్బు పిచ్చితోనే గతంలో ఇద్దరికి విడాకులు ఇచ్చింది. పవిత్ర పచ్చి అవకాశవాది. ఆ విషయం నరేష్‌ ఇంకా అర్థం కావట్లేదు. నరేష్‌కు దగ్గరై విజయ నిర్మల గారు సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని కొట్టేయాలనేదే ఆమె ప్లాన్‌. ఈ విషయం నరేష్‌కు కూడా త్వరలోనే అర్థం అవుతుంది’ అంటూ పవిత్రపై సుచేంద్ర ప్రసాద్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఆయన వ్యాఖ్యలతో మరోసారి నరేష్‌-పవిత్ర ప్రేమ, పెళ్లి వార్తల్లోకెక్కింది. కాగా గతంలో కూడా సుచేంద్ర ప్రసాద్‌ పవిత్రపై ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ మంచిది కాదని, ఆమెకు కాపురాలు కూల్చే బుద్ధి ఉందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement