మాజీ సీఎం కేజ్రీవాల్‌ ఓటమి | Delhi Assembly Election Result 2025 Live Updates Telugu, Check Votes Counting Details Of BJP, AAP And Congress | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

మాజీ సీఎం కేజ్రీవాల్‌ ఓటమి

కేజ్రీవాల్‌, సిసోడియా ఓటమి

  • ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ అగ్ర నేతలకు బిగ్‌ షాక్‌
  • అగ్ర నేతలు కేజ్రీవాల్‌, సిసోడియా, అతిశి ఓటమిని చవిచూశారు.
  • న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ ఓటమి
  • 1200 ఓట్ల తేడాతో కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ విజయం 
  • జంగ్‌పురాలో సిసోడియా ఓటమి
2025-02-08 12:42:11

పార్టీల ఓటు షేర్‌ ఇలా..

  • ఇప్పటి వరకు ఓట్‌ షేర్‌ ఇలా..
  • బీజేపీ- 48 శాతం
  • ఆప్‌- 43 శాతం
  • కాంగ్రెస్‌-6.7 శాతం
  • బీజేపీ, ఆప్‌ మధ్య ఓట్‌ షేర్‌ తేడా-5 శాతం 
2025-02-08 11:10:20

బీజేపీ ఆఫీస్‌ వద్ద సంబరాలు..

  • బీజేపీ ఆఫీస్‌ వద్ద సంబరాలు..
  • ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజ
  • బీజేపీ ఆఫీస్‌ వద్ద కాషాయ పార్టీ కార్యకర్తల సంబరాలు..
  • డ్యాన్స్‌ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఎంజాయ్‌


 

2025-02-08 11:00:55

బీజేపీకి స్పష్టమైన మెజార్టీ

  • బీజేపీకి స్పష్టమైన మెజార్టీ
  • ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ
  • బీజేపీ-42
  • ఆప్‌-28
  • కాంగ్రెస్‌-0
2025-02-08 10:58:35

ఆధిక్యంలో కేజ్రీవాల్‌, సిసోడియా

  • న్యూఢిల్లీ స్థానంలో ఆధిక్యంలోకి కేజ్రీవాల్‌
  • జంగ్‌పురాలో ఆధిక్యంలోకి సిసోడియా
  • మాల్వీయ నగర్‌లో ఆప్‌ అభ్యర్థి సోమనాథ్‌ భారతి ముందంజ
  • బిజ్వాసన్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాశ్‌ గెహ్లాట్‌ ముందంజ 

 

2025-02-08 10:00:06

ఢిల్లీ బీజేపీదే..

  • ఢిల్లీలో బీజేపీ ‍ప్రభంజనం..
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక్లలో బీజేపీ దూసుకెళ్తోంది. 
  • ఇప్పటికే దాదాపు 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 
  • బీజేపీ దెబ్బకు ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఖంగుతిన్నాయి. 
  • ఔటర్‌ ఢిల్లీలో కూడా ఆప్‌ తుడిచిపెట్టుకుపోయింది. 
  • 2013 ఎన్నికల తర్వాత ఆప్‌ అతిపెద్ద ఓటమిని చవిచూసే అవకాశం ఉంది. 
2025-02-08 09:35:54

ఆధిక్యంలో బీజేపీ

  • ఆధిక్యంలో బీజేపీ
  • ఇప్పటికే ఆధిక్యంలోనే బీజేపీ
  • బీజేపీ-42
  • ఆప్‌-26
  • కాంగ్రెస్‌-1 చోట ఆధిక్యం 
2025-02-08 09:04:41

ఆప్‌ వెనుకంజ..

  • ఆప్‌ వెనుకంజ..
  • ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూకుడు
  • ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ 37 స్థానాల్లో ఆధిక్యం
  • ఆప్‌ 27 స్థానాల్లో ఆధిక్యం
  • కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో ఆధిక్యం. 
2025-02-08 08:55:47

బీజేపీ నేతలు ముందంజ..

  • బీజేపీ నేతలు ముందంజ..
  • బల్లిమరాన్‌లో ఆప్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ హుస్సేన్‌ ముందంజ
  • కార్వార్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్‌ మిశ్రా ఆధిక్యం.
  • బాదిలిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి దేవేంద్ర యాదవ్‌ ముందంజ
  • శకూర్‌బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్రజైన్‌ ఆధిక్యం.
  • ఓక్లా స్థానంలో ఆప్‌ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్‌ లీజ్‌.
  • గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అరవింద్‌ సింగ్‌ ఆధిక్యం. 
     
2025-02-08 08:52:43

బీజేపీ ముందంజ..

  • బీజేపీ ముందంజ..
  • ఇప్పటి వరకు ముందంజలో బీజేపీ
  • బీజేపీ-36
  • ఆప్‌-23
  • కాంగ్రెస్‌-1
     
2025-02-08 08:48:32

బీజేపీదే హవా..

  • బీజేపీదే హవా..
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ నేతలు ముందంజ
  • బీజేపీ-19
  • ఆప్‌-15
  • కాంగ్రెస్‌-1
2025-02-08 08:30:47

దూసుకుపోతున్న బీజేపీ

  • దూసుకుపోతున్న బీజేపీ
  • కల్కాజీలో రమేష్‌ బిదూరి ఆధిక్యం.
  • బల్లిమరాన్‌లో ఆప్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ హుస్సేన్‌ వెనుకంజ.
  • కార్వార్‌ నగర్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్‌ మిశ్రా ఆధిక్యం.
  • వెనుకంజలో ఆప్‌ అగ్ర నేతలు. 
     
2025-02-08 08:28:59

ఆప్‌ నేతలు వెనుకంజ

  • ఆప్‌ నేతలు వెనుకంజ
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఆప్‌ నేతలు వెనకంజ
  • న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్‌ వెనుకంజ
  • జంగ్‌పురాలో సిసోడియా వెనుకంజ
  • కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ ముందంజ
  • కల్కాజీలో అతిషి వెనుకంజ
  • షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ వెనుకంజ
2025-02-08 08:21:48

కాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు

  • కాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు
  • కాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 

 

2025-02-08 08:19:30

ఆధిక్యంలో బీజేపీ..

  • ఆధిక్యంలో బీజేపీ..
  • కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు. 
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీదే ఆధిక్యం
  • బీజేపీ-10
  • ఆప్‌-6
  • కాంగ్రెస్‌-1
2025-02-08 08:09:27

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం
  • ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది
  • 19 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు  ప్రారంభం 

 

2025-02-08 08:00:36

పరువు కోసం కాంగ్రెస్‌ ఎదురుచూపు..

  • పరువు కోసం కాంగ్రెస్‌ ఎదురుచూపు..
  • గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఢిల్లీలో కాంగ్రెస్‌కు దక్కింది సున్నా.
  • ఈసారి పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్న హస్తం పార్టీ.
  • 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్
     
2025-02-08 07:54:46

ఆప్‌దే గెలుపు.. కేజ్రీవాలే సీఎం: అతిశి

  • ఎన్నికల్లో ఆప్‌దే విజయం: సీఎం అతిశి
  • ఇవి మామూలు ఎన్నికల కాదు..
  • మంచికి, చెడుకి మధ్య జరిగిన ఫైటింగ్‌ ఇది.
  • ఢిల్లీ ప్రజలు ఆప్‌ వైపే ఉన్నారని నా నమ్మకం.
  • మేము కచ్చితంగా గెలుస్తాం. 
  • ఎన్నికల్లో గెలిచి కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అవుతారు. 
2025-02-08 07:50:11

పోస్టల్‌ బ్యాలెట్‌ బ్యాక్స్‌లు తరలింపు..

  • పోస్టల్‌ బ్యాలెట్‌ బ్యాక్స్‌లు తరలింపు..
  • కౌంటింగ్‌ కేంద్రాలకు పోస్టల్‌ బ్యాలెట్‌ బ్యాక్స్‌లు తరలింపు..
  • కాసేపట్లో ప్రారంభం కానున్న ఎన్నికల కౌంటింగ్‌
  • మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఓట్ల లెక్కింపు 

 

2025-02-08 07:44:45

గెలుపు మాదే: సిసోడియా

  • గెలుపు మాదే: సిసోడియా
  • ఎన్నికల ఫలితాలపై ఆప్‌ ధీమా
  • ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా కీలక వ్యాఖ్యలు
  • గెలుపు తమదే అంటున్న ఆప్‌ నేతలు
  • ఢిల్లీ విద్యావ్యవస్థలో మార్పులు, ఎంతో అభివృద్ధి చేశామన్న సిసోడియా
2025-02-08 07:19:08

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం..

  • కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం..
  • ఎన్నికల ఓట్లు లెక్కింపు 8 గంటలకు ప్రారంభం
  • కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు
  • ఢిల్లీ అసెంబ్లీకి మ్యాజిక్‌ ఫిగర్‌ 36
  • 50 స్థానాల్లో గెలుపు తమదే అంటున్న బీజేపీ
  • మూడోసారి అధికారంలోకి వస్తామని ఆప్‌ ధీమా

 

 

2025-02-08 07:15:41

గత ఎన్నికల ఫలితాలు ఇలా..

  • గత ఎన్నికల ఫలితాలు ఇలా..
  • ఆప్‌.. 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది.
  • ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు
  • ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనా
  • వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్‌
  • అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లయినా వస్తాయని కాంగ్రెస్‌ నేతలు ఆశలు
2025-02-08 07:15:41

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

  • ఓట్ల లెక్కింపునకు పూర్తయిన ఏర్పాట్లు  
  • వరుసగా మూడోసారి విజయంపై ‘ఆప్‌’ ధీమా  
  • అధికారం బీజేపీదేనని వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు   
  • 19 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.
  • ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
  • ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
  • ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు 
2025-02-08 07:01:18
Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement