న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఈనెల 26న ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. ఢిల్లీ ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం(మార్చి 23) ఢిల్లీలోని హహీదీ పార్క్‌న ఉంచి ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుందని తెలిపారు. పంజాబ్ సీఎం భఘవంత్ మాన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు అంతదర ఈ నిరసనల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇండియా కూటమి నేతలు కూడా ఆందోళనల్లో పాల్గొంటారని వెల్లడించారు,.
24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తామని, 25న తమ పార్టీ హోలీ పండుగను జరుపుకోబోదని తెలిపారు. మార్చి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడి చేయనున్నట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతున్నందున, మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆప్ తన పోరాటం ఉధృతం చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు.
మరోవైపు సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని ఐటీవో జంక్షన్ వద్ద ఆందోళనకు దిగిన ఆప్ మంత్రులు అతిషీ, సౌరవ్ భరద్వాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ విద్యా శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్‌ను కూడా అదుపులోకి తీసుకొన్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించారు. ఈడీ ప్రధాన కార్యాలయం, బీజేపీ ఆఫీస్‌ల వద్ద భారీగా బలగాలను మొహరించారు.
చదవండి: Delhi liquor scam: ఆమ్ ఆద్మీ భవితవ్యం ఏమిటీ?
Comments
Please login to add a commentAdd a comment