దేశ రాజధాని ఢిల్లీలో మంత్రుల కొనుగోలుకు కుట్ర జరుగుతుందంటూ ఆప్ మంత్రి అతిషి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్ 29న తమ ఎదుట హాజరు కావాలని అతిషిని ఆదేశించింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై స్పందనలో భాగంగా కోార్టు ఈ విధంగా స్పందించింది.
కాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మంత్రి అతిషి ఆప్‌ర్టీని, ప్రభుత్వాన్ని ఢిల్లీలో సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బీజేపీ ఆరోపణలు గుప్పించారు. ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు వలగా వేస్తూ వారిని కొనేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
దీనికి తోడు తన రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండేందుకు పార్టీ మారాలని బీజేపీ తనకు ఆఫర్ చేసిందని అతిషి ఆరోపించారు. ‘బీజేపీ సన్నిహితుల ద్వారా నన్ను సంపద్రించింది. వారు నన్ను బీజేపీలో చేరమని అడిగారు. ఇది నా రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారు. ఒకవేళ నేను సానకటీ మారకపోతే, నెల రజుల లోపల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నన్ను అరెస్టు చేస్తుందని బెదిరించారు వారు బెదిరించారు’ అని పేర్కొంది.
అతిషితో పాటు, ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ సైతం ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. వీటిని తప్పుడు, నిరాధారమైనవిగాపేర్కొంది. ఒకవేళ కేజ్రీవాల్, అతిషి ఆరోపణలు నిజమైతే వాటికి సాక్షాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ పోలీసులను ఆశ్రయించగా.. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఢిల్లీ పోలాసులు నోటీసులు జారీ చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. అతిషి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అతిషికి నోటీసులు జారీ చేసింది. జూన్ 29న మ ఎదుట హాజరు కావాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment