
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా గురువారం విడుదల చేసింది. మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఛత్తర్‌పూర్ నుంచి బ్రహ్మ సింగ్ తన్వార్, కిరాడి నుంచి అనిల్ ఝా, విశ్వాస్ నగర్ నుంచి దీపక్ సింగ్లా, రోహతాన్ నగర్ నుంచి సరితా సింగ్, లక్ష్మీ నగర్ నుంచి బీబీ త్యాగి, బదార్‌పూర్ నుంచి రామ్ సింగ్, సీలమ్‌పూర్ నుంచి జుబీర్ చౌధురి, సీమాపురి నుంచి వీర్ సింగ్ ధిగాన్, ఘోండా నుంచి గౌరవ్ శర్మ, కర్వాల్ నగర్ నుంచి మనోజ్ త్యాగి, మాటియాలాలో సోమేశ్ షౌకీన్ పేర్లను కేజ్రీవాల్ ఖరారు చేశారు.
ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల ఆప్‌లో చేరిన ఆరుగురు నేతలు ప్రముఖంగా ఉన్నారు. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మ్‌సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగితో పాటు కాంగ్రెస్ మాజీ నాయకులు చౌదరి జుబేర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేష్ షోకీన్‌లను అభ్యర్థులుగా ఆప్ ప్రకటించింది. అయితే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్ నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment