సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరుస్తున్న వేళ కేజ్రీవాల్‌తో ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. దీంతో, కేజ్రీవాల్ సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో భాగంగా కేజ్రీవాల్‌ను శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా పటిష్ట పోలీసు భద్రత మధ్య కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. కాగా, తనను ఈడీ ఆఫీసు నుంచి కోర్టుకు తీసుకువచ్చే క్రమంలో ఢిల్లీ ఏసీపీ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని కేజ్రీవాల్ ఆరోపించారు. అవసరం లేకున్నా ఏక్ సింగ్ అత్యుత్సహం ప్రదర్శించి తనను ఇబ్బందులకు గురిచేసినట్టు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏకే సింగ్‌ను తన సెక్యూరిటీ నుంచి తొలగించాలని రౌస్ అవెన్యూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు.
ఇదిలా ఉండగా.. గతంలో కూడా ఏకే సింగ్ ఇలాగే ప్రవర్తించడం విశేషం. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కూడా ఏకే సింగ్ ఇలాగే ప్రవర్తించారు. లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను కోర్టులో హాజరుపరుస్తున్న క్రమంలో ఏకే సింగ్.. సిసోడియా మెడ పట్టుకుని తీసుకెళ్లారు. దీంతో, ఈ ఘటన అప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టు ఈడీ కస్టడీ విధించింది. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్‌ను ఈడీ.. ఆరు రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించనుంది. ఇక, లిక్కర్ స్కాం కేసు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో, వీరిద్దరిని కలిపి ఈడీ విచారించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment