ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఢిల్లీ మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మరో నలుగురు ఆప్ నేతలు అరెస్ట్ అవతారని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, మంత్రి అతిషి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రెండు నెలల్లో, లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె చెప్పారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నట్లు వెల్లడించారు. నిన్న ఈడీ తన పేరును, సౌరభ్ భరద్వాజ్ పేరును ఛార్జ్‌షీట్‌లో పేర్కొందన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల తమకు భయం లేదని, ఎంత మందిని అరెస్టు చేసినా తమ పోరాటం ఆగదు అని పేర్కొన్నారు.
#WATCH | Delhi Minister and AAP leader Atishi says, "In the coming two months before the Lok Sabha elections, they will arrest 4 more AAP leaders - Saurabh Bharadwaj, Atishi, Durgesh Pathak and Raghav Chadha..." pic.twitter.com/AZdfOrQG7S
— ANI (@ANI) April 2, 2024
ఇదే సమయంలో తాము కేజ్రీవాల్ సైనికులమని ఆమె అన్నారు. తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని, ఆప్ కార్యకర్తలను బీజేపీ జైల్లో వేసినా, ప్రతీ కార్యకర్త మళ్లీ పోరాటం చేస్తూనే ఉంటారన్నారు. ఒక్కరిని జైల్లో వేస్తే పది మంది పోరాడేందుకు పుట్టుకు వస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ ఐక్యంగా, బలంగానే ఉంది. ఒకవేళ బీజేపీలో చేరితే తనను అరెస్టు చేయబోరని ఓ నేత చెప్పినట్లు మంత్రి ఆతిషి వెల్లడించారు.
#WATCH | Delhi Minister and AAP leader Atishi says, "Yesterday the ED took Saurabh Bharadwaj and my name in the court, on the basis of a statement which is available with ED and CBI for one and a half years, this statement is in the charge sheet of ED. This statement is also in… pic.twitter.com/oPRecz0QBZ
— ANI (@ANI) April 2, 2024
ఇదే సమయంలో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించగా ఆమె ఘాటు విమర్శలు చేశారు. విపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment