
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన క్రేజీ న్యూస్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
(ఇది చదవండి: ఎంపీతో హీరోయిన్ డేటింగ్.. నిశ్చితార్థం డేట్ ఫిక్స్!)
తాజాగా ఈ ప్రేమజంట ఈనెల 13న నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. అలాగే వీరి పెళ్లి అక్టోబర్‌లో జరిగే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే వీరిద్దరూ గతంలో కలిసే చదువుకున్నారని.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసిందని టాక్ వినిపిస్తోంది. కాగా.. ప్రస్తుతం పరిణీతి చోప్రా సినిమాలతో బిజీగా ఉంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అందువల్లే పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!)
Comments
Please login to add a commentAdd a comment