
పరిణీతి చోప్రా
సరిగ్గా రెండు రోజుల క్రితమే పరిణీతి చోప్రా మాల్దీవుల్లోని తన ‘జాలీడేయింగ్’ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లోని పరిణీతి ముఖంలో.. ఆ దీవుల్లోని అందమంతా ప్రతిఫలించింది. ఏదో పొలిటికల్ సంక్షోభం. ‘అయ్యో! మన పరిణీతి ఎలా ఉందో’ అని అభిమానులు కలవరపడటం మొదలుపెట్టేశారు. ట్వీటర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఎక్కడ వీలైతే అక్కడ.. బీ సేఫ్ పరీ, టేక్ కేర్ పరీ.. అని పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే అటువైపు నుంచి, అంటే... పరిణీతి వైపు నుంచీ రెస్పాన్స్ ఏమీ రాలేదు. దాంతో వీళ్ల కంగారు మరింత ఎక్కువైంది. ‘ఎక్కడున్నావ్ పరీ.. ఎలా ఉన్నావ్ పరీ.. ఒక్క పోస్టు పెట్టి వెళ్లిపో పరీ’ అని ప్రాధేయపడుతున్నారు. ఎమర్జెన్సీలో పరిస్థితులు ఊహించని విధంగానే ఉంటాయి.
అయితే.. ఏ దేశమైనా అలాంటి పరిస్థితుల్లో విదేశీ టూరిస్టుల భద్రతను దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ముందు వాళ్లనే విమానం ఎక్కించి పంపించేస్తుంది. పరిణీతి కూడా నేడో రేపో ఇండియా వచ్చేయొచ్చు. బహుశా ఇప్పుడు ఇండియాకు వచ్చే దారిలో కూడా ఉండి ఉండొచ్చు. కనుక ఆమె ప్రాణాలను తమ అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న ఫ్యాన్స్... ఆ టెన్షన్ వదిలేసి, విదేశీయానాన్ని విజయవంతంగా ముగించుకుని వస్తున్న పరిణీతి శుభాకాంక్షల్ని సిద్ధం చేసుకోవచ్చు.