
Parineeti Chopra- Beauty Tips: పొడి చర్మం కారణంగా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది అమ్మాయిలు. అలాంటి వాళ్లు ఈ టిప్స్ పాటిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు అంటోంది బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. తన తల్లి చెప్పిన చిట్కాలు పాటించి ముఖ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకుంటానని చెబుతోంది. పరిణీతి పంచుకున్న బ్యూటీ టిప్స్ ఆమె మాటల్లోనే..
‘నాది డ్రై స్కిన్. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను. మంచినీళ్లు బాగా తాగుతాను. రాజూ పొద్దున్నే అలోవెరా జెల్‌ను మొహానికి అప్లయ్ చేస్తాను. ఈ కిటుకు మా అమ్మ చెప్పిందే.
అలోవెరా కాకుండా మాయిశ్చరైజర్‌ను కూడా వాడతా. ఇవే నా బ్యూటీ సీక్రెట్స్!’ అని పరిణీతి చోప్రా పేర్కొంది. కాగా మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, టాలీవుడ్ నటి మీరా చోప్రాల కజిన్ పరిణీతి.
హర్యానాలో వ్యాపార కుటుంబంలో జన్మించిన పరిణీతి.. ఇంగ్లండ్‌లో ఉన్నత విద్యనభ్యసించింది. 2009లో ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్‌గా జాయిన్ అయింది. ఈ క్రమంలో లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్‌తో నటిగా తెరంగేట్రం చేసింది. ఇష్క్‌జాదేతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీ అయిపోయింది.
చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..