
'అది చోప్రాల రక్తంలోనే ఉంది'
సడన్గా సన్నగా మారి అందరి దృష్టినీ ఆకర్షించిన బాలీవుడ్ అందం పరిణీతి చోప్రా.. తన తదుపరి చిత్రం 'మేరీ ప్యారీ బిందు' కోసం ఓ పాట పాడుతున్నారు.
సడన్గా సన్నగా మారి అందరి దృష్టినీ ఆకర్షించిన బాలీవుడ్ అందం పరిణీతి చోప్రా.. తన తదుపరి చిత్రం 'మేరీ ప్యారీ బిందు' కోసం ఓ పాట పాడుతున్నారు. ప్రియాంకా చోప్రా ఇదివరకే ఇన్ మై సిటీ, ఎక్సాటిక్ లాంటి ఆల్బమ్స్లో ప్రొఫెషనల్ సింగర్స్కి ఏమాత్రం తీసిపోకుండా పాటలు పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్క బాటలోనే పరిణీతి కూడా గొంతు సవరించింది.
దీనిపై పరిణీతి మాట్లాడుతూ.. 'నేను పాడుతున్నానని తెలియగానే ఇంట్లోవాళ్లంతా ఎగ్జైట్ అయ్యారు. మేమంతా బాగా పాడగలమన్న విషయం అందరికీ తెలిసిందే. పాడటం చోప్రాల రక్తంలోనే ఉన్నట్టుంది.. అందుకే మా వాళ్లంతా చాలా సంతోషంగా ఫీలయ్యారు' అంటూ చెప్పుకొచ్చింది. మరి ప్రియాంకలానే ఆల్బమ్స్ వరకు వెళ్తారా అంటే.. ప్రస్తుతానికి సినిమాల్లో పాడాలనుకుంటున్నాను, మిగిలినవి ఆ తర్వాత చూద్దాం అని ముగించింది ఇష్క్ జ్యాదే స్టార్ పరిణీతి చోప్రా.