శ్రీదేవి కుమార్తెను కలవలేదు | Parineeti not working with Mahesh Babu: Murgadoss | Sakshi
Sakshi News home page

శ్రీదేవి కుమార్తెను కలవలేదు

Published Sun, Aug 28 2016 4:50 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

శ్రీదేవి కుమార్తెను కలవలేదు - Sakshi

శ్రీదేవి కుమార్తెను కలవలేదు

ముంబై: ప్రిన్స్ మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నటించడం లేదని తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ స్పష్టం చేశాడు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే పరిణీతి ఈ ఆఫర్ను అంగీకరించలేదని చెప్పాడు. మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన పరిణీతి నటించడం లేదని ఇంతకుముందే వార్తలు వచ్చినా మురుగదాస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీదేవి కుమార్తె జాహ్నవి నటించనుందని వచ్చిన వార్తలపైనా మురుగదాస్ స్పందించాడు. ఈ సినిమా కోసం పరిణీతిని అడిగాము కానీ, జాహ్నవిని ఎప్పుడూ సంప్రదించలేదని చెప్పాడు. జాహ్నవిని కలిసినట్టు వచ్చిన వార్తలు అవాస్తమని తెలిపాడు. మురుగదాస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా అకీరా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement