మహేష్కు జోడిగా అలియా
బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మహేష్ బాబు చేయబోయే నెక్ట్స్ సినిమా పనులు కూడా ఊపందుకున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించిన మహేష్, ఆ సినిమాను భారీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగు, తమిళ్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా నార్త్ బ్యూటిని నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటి పరిణీతి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందటూ ప్రచారం జరిగింది. అయితే సౌత్ సినిమాలో నటించేందుకు పరిణీతి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఆమెను పక్కన పెట్టేశారు చిత్రయూనిట్. తాజాగా క్యూట్ హీరోయిన్ అలియా బట్ను మహేష్కు జోడిగా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఈ జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. గజిని, తుపాకీ లాంటి సినిమాలతో టాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మురుగదాస్, మహేష్ సినిమాతో టాలీవుడ్లో కూడా స్టార్ డైరెక్టర్ అనిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.