గోల్డెన్ చాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్ | Rakul Preet replaces Parineeti in Mahesh Babu's next | Sakshi
Sakshi News home page

గోల్డెన్ చాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్

Published Thu, Jul 7 2016 7:00 PM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

గోల్డెన్ చాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్ - Sakshi

గోల్డెన్ చాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్

టాలీవుడ్లో దాదాపు యంగ్ హీరోలు అందరి సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఓ గోల్డెన్ చాన్స్ కొట్టేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం ఈ ఢిల్లీ చిన్నది సొంతం చేసుకుందని టాక్. నిజానికి ఈ సినిమాలో మహేష్ పక్కన బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నటించాల్సి ఉంది. కానీ, ఎందుకోగానీ ఈ ప్రాజెక్టు నుంచి పరిణీతి తప్పుకొందట.

దాంతో దర్శక నిర్మాతలు రకుల్ ప్రీత్ను సంప్రదించగా.. మహేష్ పక్కన అనగానే ఎగిరి గంతేసి ఆమె ఒప్పుకొందని అంటున్నారు. ఇప‍్పటికే టెస్ట్ షూట్ కూడా అయ్యిందని, ఇక ఆమెను ఓకే చేయడం ఒక్కటే తరువాయని సినిమా వర్గాలు అంటున్నాయి. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హారిస్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రధానంగా ముంబై మహానగరంలో షూటింగ్ జరుపుకొనే ఈ సినిమాకు దాదాపు రూ. 90 కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement