ఒక్క ఫైట్‌... మూడు కోట్లు! | single fight 3 crores budget in mahesh babu movie | Sakshi
Sakshi News home page

ఒక్క ఫైట్‌... మూడు కోట్లు!

Published Thu, Mar 23 2017 11:29 PM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

ఒక్క ఫైట్‌... మూడు కోట్లు! - Sakshi

ఒక్క ఫైట్‌... మూడు కోట్లు!

మరో నాలుగు రోజులు మహేశ్‌బాబు నిద్రలేని రాత్రులు గడపనున్నారు. డే టైమ్‌లో మాత్రం నిద్రపోతారు. ఎందుకలా అనుకుంటున్నారా? మరేం లేదు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన ఓ భారీ ఫైట్‌ను రాత్రిపూట చిత్రీకరించనున్నారు. దీనికోసం ఈ చిత్రబృందం వియత్నాం వెళ్లింది. అక్కడి హో చో మిన్, హనోయ్‌ నగరాల్లో నాలుగు రోజుల పాటు ఈ ఫైట్‌ను చిత్రీకరించనున్నారు. సినిమాలో ఉన్న ఫైట్స్‌ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయట. ముఖ్యంగా ఈ ఫైట్‌కి భారీగా ఖర్చుపెడుతున్నారని సమాచారం.

దాదాపు మూడు కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించే ఈ ఫైట్‌ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుందట. వియత్నాం షెడ్యూల్‌తో క్లైమ్యాక్స్, రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుంది. బ్యాలెన్స్‌ చిత్రీకరణ వచ్చే నెల మొదటివారానికల్లా పూర్తయిపోతుందట. ఫస్ట్‌ లుక్‌ను ఆ తర్వాత విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. జూన్‌ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement