కోలీవుడ్‌కు రకుల్‌ రీఎంట్రీ | rakul re- entri to Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు రకుల్‌ రీఎంట్రీ

Published Wed, Feb 22 2017 1:55 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

కోలీవుడ్‌కు రకుల్‌ రీఎంట్రీ - Sakshi

కోలీవుడ్‌కు రకుల్‌ రీఎంట్రీ

టీనగర్‌: కోలీవుడ్‌ చిత్రసీమకు నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ రీ ఎంట్రీ కానున్నారు. 2014లో ఎన్నమో ఏదో చిత్రంలో నటించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు తమిళంలో అవకాశాలు లభించకపోవడంతో తెలుగు చిత్రరంగం వైపు మొగ్గు చూపారు. మూడేళ్లుగా కోలీవుడ్‌పై కన్నెత్తి చూడని రకుల్‌ తనకంటూ విభిన్న తరహా పాత్ర కోసం వేచి చూశారు. మంచి స్క్రిప్ట్, పేరున్న దర్శకుడు, పెద్ద నటుడితో చిత్రం వస్తేనే తమిళంలో రీ ఎంట్రీ అవుదామని ఎదురుచూశారు. కొన్ని నెలల క్రితం మిష్కిన్‌ దర్శకత్వంలో విశాల్‌ నటించే తుప్పరివాలన్‌ చిత్రంలో నటించేందుకు అవకాశం లభించింది. మొదట్లో నటించడానికి అంగీకారం  తెలిపిన రకుల్‌ తర్వాత ఆ చిత్రం నుంచి వైదొలిగారు.

అదే సమయంలో తమిళం, తెలుగులో కార్తి నటనలో రూపొందుతున్న ధీరన్‌ అ«ధికారం ఒన్రు చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ముందుగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న తమిళ, తెలుగు వెర్షన్లలో రూపొందే సంభవి చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న సెల్వరాఘవన్‌ దర్శకత్వంలోని కొత్త చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. మూడేళ్లుగా తమిళంలో అవకాశాలు రాకపోగా, ప్రస్తుతం ఒకే ఏడాదిలో మూడు చిత్రాలకు ఒప్పందం కుదరడంతో కోలీవుడ్‌ హీరోయిన్లను కలవరపెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement