మహేష్ కు నిద్రలేని రాత్రులు.. | Mahesh Babu Sleepless Nights | Sakshi
Sakshi News home page

మహేష్ కు నిద్రలేని రాత్రులు..

Published Tue, Aug 2 2016 7:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

మహేష్ కు నిద్రలేని రాత్రులు..

మహేష్ కు నిద్రలేని రాత్రులు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దానికి కారణం టాప్ డైరెక్టర్ మురుగదాస్. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వరుసగా రాత్రివేళల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. వారం రోజులపాటు హైదరాబాద్లో షూటింగ్ అనంతరం ముంబై, గుజరాత్, పూణె, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాలో మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా కనిపించనున్నారని టాక్. మురుగదాస్ ముందు సినిమాల మాదిరిగానే సామాజికపరమైన అంశాలతో కూడుకున్న కథనంగా తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేసే అవకాశాలున్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement