మహేశ్‌కి ఇద్దరు కాదు! | Nayanthara not part of Mahesh Babus film, confirms AR Murugadoss | Sakshi
Sakshi News home page

మహేశ్‌కి ఇద్దరు కాదు!

Published Fri, Sep 16 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

మహేశ్‌కి ఇద్దరు కాదు!

మహేశ్‌కి ఇద్దరు కాదు!

క్లారిటీ ఇచ్చిన మురుగదాస్
 మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో మహేశ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా చేస్తున్నారు. కాగా, ఇందులో ఉన్న ఓ కీలక పాత్రకు నయనతారను ఎంపిక చేశారనే వార్త రెండు రోజులుగా హల్‌చల్ చేస్తోంది. ఈ విషయం గురించి మురుగదాస్ క్లారిటీ ఇచ్చేశారు.
 
  ‘‘ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన ఒకే ఒక్క కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఇందులో రెండో కథానాయిక పాత్ర లేదనీ, కీలక పాత్ర అసలే లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అక్కడ ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. డ్యాన్స్ డెరైక్టర్ శోభి ఆధ్వర్యంలో ఈ పాటను చిత్రీకరించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement