IPL 2023: Parineeti Chopra, Raghav Chadha Watch PBKS Vs MI Match In Mohali, Pic Viral - Sakshi
Sakshi News home page

Parineeti Chopra - Raghav Chadha: ఐపీఎల్‌ మ్యాచ్‌లో ప్రేమజంట.. సోషల్ మీడియాలో వైరల్

Published Thu, May 4 2023 7:03 AM | Last Updated on Thu, May 4 2023 9:52 AM

Parineeti Chopra and Raghav Chadha watch IPL match at Mohali Goes Viral - Sakshi

బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్‌లో ఉన్న భామ ఈనెలలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకునేందుకు సిద్ధమైంది. ఈనెల 13న ఈ ప్రేమజంట దిల్లీలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ఇప్పటికే బీ టౌన్‌లో తెగ చర్చ నడుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్‌లోనే వివాహాబంధంలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన పరిణితీ చోప్రా, రాఘవ్ మరోసారి సందడి చేశారు.

(ఇది చదవండి: పొలిటీషియన్‌తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్‌ నేత.. వీడియో వైరల్‌)

ఈసారి ఏకంగా ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పంజాబ్‌లోని మొహాలి వేదికగా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు ఈ ప్రేమజంట హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పరిణితీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మొహాలి వేదికగా జరిగిన మ‍్యాచ్‌లో పంజాబ్-ముంబయి జట్లు తలపడ్డాయి. 

కాగా.. గతంలో బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ‌ రాఘవ చద్దాతో పరిణీతి ముంబయిలోని ఓ రెస్టారెంట్‌లో కనిపించింది. దీంతో వీరిద్దరు  ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు జంటగా మీడియా కంట పడ్డారు. అంతే కాకుండా ఈ లవ్‌ బర్డ్స్‌కు  ఆప్ నేతలు సైతం ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలిపారు. 

(ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement