
పరిణీతీ చోప్రా
కరోనా వైరస్‌ను నిర్మూలించే ప్రక్రియలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయాన్ని కొందరు ఇబ్బందిగా ఫీల్ అవ్వడాన్ని తప్పుపడుతున్నారు హీరోయిన్ పరిణీతీ చోప్రా. ఈ విషయం గురించి పరిణీతి మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే తాము జైలు జీవితాన్ని గడపుతున్నామనే భావనలో కొందరు ఉంటున్నారు. లాక్‌డౌన్ అనేది వారి జీవితాలను కాపాడటం కోసమేనని వారు తెలుసుకోవాలి. మీకు (లాక్‌డౌన్‌ను ఇబ్బందిగా ఫీలయ్యేవారిని ఉద్దేశిస్తూ) 21 రోజుల లాక్‌డౌన్ అనేది జైలు కాదు...మనందరి మేలు కోసం ప్రభుత్వం తీసుకున్న ఓ మంచి నిర్ణయం. బాధ్యత గల పౌరులుగా మనందరం ప్రభుత్వాలకు సహకరించాలి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ సమస్యకు త్వరలోనే సరైన పరిష్కారం దొరకాలని ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment