
పరిణీతి చోప్రా
యాక్టర్స్ జర్నీలో హిట్‌లు, ఫ్లాప్‌లు సహజం. కానీ, వారి కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారి ఎంతో కొంత ఆందోళన చెందుతుంటారు కొందరు హీరోహీరోయిన్లు. ఈ విషయంపై మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? అని బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను అడిగినప్పుడు...‘‘ఒక సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఈ సినిమా ఆడుతుందా? లేదా? అనే విషయం నాకు తెలిసిపోతుంది. కానీ, అన్నివేళల మన ఊహ నిజం కాకపోవచ్చు. అందుకే ఆడియన్స్ నిర్ణయం కోసం ఎదురుచూడాలి. సినిమాల గురించి ఆడియన్స్‌ను మించిన విమర్శకులు లేరని నా అభిప్రాయం’’ అన్నారు పరిణీతి.
మరి షూటింగ్ లొకేషన్‌లో సినిమా రిజల్ట్‌ని గెస్ చేయగలరా మీరు? అన్న ప్రశ్నను ఆమె ముందు ఉంచితే..‘‘కొన్ని సార్లు తెలిసిపోతుంది. కానీ నటిగా నా పాత్రకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. దానిపైన ఎక్కువగా ఫోకస్ పెడతాను. అందుకోసం ప్లాన్స్ వేస్తాను. ఇక సినిమా రిజల్ట్‌ను ఆడియన్స్ డిసైడ్ చేస్తారు’’ అన్నారు పరిణీతి. ప్రస్తుతం ‘ద గాళ్ ఆన్ ది’ ట్రైన్ సినిమా కోసం ఆగస్టులో లండన్ వెళ్లనున్నారీ బ్యూటీ. అలాగే బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ ను సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయనున్నట్లు చెప్పారామె.
Comments
Please login to add a commentAdd a comment