
‘ఏదైనా హిట్ చిత్రం రీమేక్‌లో నటించినప్పుడు ఆ సినిమాలోని నటీనటుల పర్ఫార్మెన్స్‌ను ఒరిజినల్‌లో చేసినవాళ్లతో పోల్చడం సహజం. అందుకే ఈ విషయాన్ని ఓ ఛాలెంజ్‌లా తీసుకున్నాను’’ అంటున్నారు పరిణీతీ చోప్రా. పరిణీతి ముఖ్య పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’. హాలీవుడ్ చిత్రం ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’కి ఇది హిందీ రీమేక్. హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్ పోషించిన పాత్రను హిందీలో పరిణీతి చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.
ఈ సందర్భంగా పరిణీతి మాట్లాడుతూ – ‘‘ఈ రీమేక్ అంగీకరించే ముందు నా పర్ఫార్మెన్స్‌ను ఎమిలీతో పోలుస్తారేమో.. ఆమె చేసినట్టు నేను చేయగలనా? లేదా అనే ఆలోచనలు నా మనసులోనుంచి తీసేశాను. ఆ బరువును మెదడుకి ఎక్కించుకోదలుచుకోలేదు. ఈ పాత్రకు నాదైన టచ్ ఇవ్వాలనుకున్నాను. ఒరిజినల్‌కు మ్యాచ్ చేయాలని చాలా బాగా చేశాను. ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. మా రీమేక్‌ను ఎప్పుడెప్పుడు ఆడియన్స్‌కు చూపించాలా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ రీమేక్‌ను చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ చిత్రం ఈ నెల 26న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
చదవండి: రాధేశ్యామ్: ఇక్కడ ఒకరు.. అక్కడ ఇద్దరు
Comments
Please login to add a commentAdd a comment