
పరిణీతి చోప్రా
కథానాయిక పరిణీతి చోప్రా రైలు ప్రయాణం చేస్తున్నారు. అదితీరావ్ హైదరీ, కృతీకల్హారీ ఈ ప్రయాణంలో పరిణీతి చోప్రాకు తోటి ప్రయాణికులు. ఈ ముగ్గురు హీరోయిన్లు కలిసి ఏ ట్రైన్ ట్రిప్ ప్లాన్ చేయలేదు. ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే హాలీవుడ్ సినిమా హిందీ రీమేక్ మూవీ కోసం తోటి ప్రయాణికులుగా తోడయ్యారు. రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మేజర్ షూటింగ్ లండన్‌లో ప్లాన్ చేశారు. ఓ మిస్సింగ్ పర్సన్ కేసులో చిక్కుకున్న ఓ వివాహిత ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుంది. పౌలా హాకిన్స్ ఫేమస్ నవల ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ ఆధారంగా అదే టైటిల్‌తో 2015లో ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment