ఏజెంట్‌ పరిణీతి | Parineeti Chopra to Play Covert Agent in Her Next Film | Sakshi
Sakshi News home page

ఏజెంట్‌ పరిణీతి

Published Tue, Dec 29 2020 12:15 AM | Last Updated on Tue, Dec 29 2020 12:25 AM

 Parineeti Chopra to Play Covert Agent in Her Next Film - Sakshi

అండర్‌కవర్‌ ఆపరేషన్‌ కోసం రెడీ అయ్యారు పరిణీతీ చోప్రా. రిబూ దాస్‌ గుప్తా దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా కమిట్‌ అయ్యారు ఈ బాలీవుడ్‌ బ్యూటీ. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అండర్‌ కవర్‌ ఏజెంట్‌గా కనిపిస్తారు పరిణీతి. ఓ భారీ ఆపరేషన్‌ కోసం తన టీమ్‌తో కలసి ఓ మిషన్‌ మీద పాకిస్తాన్‌ వెళ్తారట. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన లొకేషన్స్‌ ఫైనల్‌ చేస్తున్నారట. పరిణీతీ, దర్శకుడు రిబూ దాస్‌ గుప్తా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న రెండో చిత్రమిది. ఇటీవలే వీరు ‘ఏ గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ సినిమా చేశారు. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement