
ఆ జోడీ సరదా స్టెప్పులకు జనం ఫిదా!
సముద్ర తీరంలో సరదా స్టెప్పులు వేస్తూ తీసిన వీడియో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిపోయింది. పెట్టిన వెంటనే ఈ వీడియోను లక్షకుపైగా మంది చూడటం గమనార్హం. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, సొట్టబుగ్గల సుందరి పరిణీతి చోప్రా సరదాగా స్టెప్పులు వేశారు. ‘గజబ్ కా హై దిన్’ అనే బ్యూటీఫుల్ పాటకు ఎలాంటి రిహార్సల్ లేకుండా సహజంగా డ్యాన్స్ చేశారు. సముద్రం ఒడ్డున ఈ పాటకు తగ్గట్టు వారి డ్యాన్స్ సహజంగా అమరిపోవడం.. అక్కడి షూటింగ్ స్టాప్‌ను విస్మయ పరిచింది. ఇదే రికార్డ్ చేస్తే సరిపోతుంది కదా అనే కామెంట్లు వినిపించాయి. ఈ వీడియోను ఆయుష్మాన్ ఖురానా శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. కాసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.
’కయామత్ కయామత్ తక్’ సినిమాలో ఆమిర్ ఖాన్, జుహీ చావ్లా జోడీ ‘గజబ్ కా హై దిన్’ పాటకు నర్తించగా.. ఇప్పుడు వారిని మరిపించేలా ఆయుష్మాన్, పరిణీతి స్టెప్పులు వేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తున్న ’మేరీ ప్యారీ బిందు’ సినిమాలో ఆయుష్మాన్, పరిణీతి జోడీగా నటిస్తున్నారు. హర్రర్ నవలా రచయితగా ఆయుష్మాన్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.