సింగర్‌ అవతారమెత్తిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్! | Star Heroine Officially Begins Her Singing Career Video Goes Viral | Sakshi
Sakshi News home page

Parineeti Chopra: 'ఈ ఏడాది అద్భుతాలు సృష్టించబోతున్నా'..పరిణీతి చోప్రా

Published Thu, Jan 25 2024 4:27 PM | Last Updated on Thu, Jan 25 2024 4:56 PM

Star Heroine Officially Begins Her Singing Career Video Goes Viral - Sakshi

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా సినీ ప్రియులకు సుపరిచితమైన పేరే. గతేడాది తన ప్రియుడు, ఆప్ ఎంపీ రాఘవచద్దాను పెళ్లాడింది. పరిణీతి చివరిసారిగా అక్షయ్‌ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మ్యారేజ్‌ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ముద్దుగుమ్మ సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ భామ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సినిమాల్లో హీరోయిన్‌గా అలరించిన పరిణీతి ప్రస్తుతం సింగర్‌గా మారిపోయింది. తన జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టూడియోలో పాట పాడుతున్న  వీడియోను అభిమానులతో పంచుకుంది. 

పరిణీతి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నాకు సంగీతం ఎప్పటికీ సంతోషకరమైన ప్రదేశం. నా జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఒకేసారి రెండు కెరీర్‌లు చేసుకునే అవకాశం కల్పించిన ఈ ప్రయాణం ఎంతో సరదాగా ఉంది. అందుకే ఇక్కడ నాకు తెలియని వాటిని నేర్చుకోవడం, నాలో భయాలన్నింటినీ తొలగించుకుని.. నా తొలి గానం ప్రారంభించా. దీనికోసం నేను ఉత్తమ సంస్థతో చేతులు కలిపా. ఈ ఏడాది మొత్తం మీ కోసం  కొన్ని అద్భుతాలు సృష్టించబోతున్నా. మీరు కూడా దీని కోసం నాలాగే ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ వీడియోలో పరిణీతి పాడిన ఈ పాట'మాన కే హమ్ యార్ నహీ' అనే పాట ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె నటించిన 2017 రొమాంటిక్ మూవీ 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలోనిది.

అయితే పరిణీతి ఇంతకుముందే మనోజ్ ముంతషిర్ రాసిన దేశభక్తి పాట 'తేరి మిట్టి' మహిళా వర్షన్‌ను అలపించింది. ఈ సాంగ్ అక్షయ్ కుమార్, పరిణీతి నటించిన 2019 యుద్ధ చిత్రం 'కేసరి'లో ప్రదర్శించారు. అంతే కాకుండా 35 ఏళ్ల బాలీవుడ్ భామ తన డిస్కోగ్రఫీలో 'మత్లాబి యారియన్' ట్రాక్‌ను కూడా కలిగి ఉంది. ఈ పాట మిస్టరీ థ్రిల్లర్ 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' అనే చిత్రంలోనిది. ఇందులో పరిణీతి, అవినాష్ తివారీ, అదితి రావ్ హైదరీ నటించారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన పరిణీతి.. తన పెళ్లి పాట 'ఓ పియా' కూడా పాడింది. కాగా.. ప్రస్తుతం ఆమె 'అమర్ సింగ్ చమ్కిలా' అనే చిత్రంలో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement